మరోసారి సాండ్‌ పేపర్‌ సెగ: వార్నర్‌ రిప్లై.. ఇంగ్లాండ్‌ అభిమానులు షాక్‌!!

0
4


బర్మింగ్‌హామ్‌: ఒకవైపు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్‌ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతుంటే.. మరోవైపు బాల్‌ టాంపరింగ్‌ ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఇంగ్లాండ్‌ అభిమానులు ఆసీస్‌ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌, స్టీవ్‌ స్మిత్‌ను ఎగతాళి చేస్తున్నారు. ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న వార్నర్‌.. ప్రస్తుతం పునరాగమనంలో తొలి టెస్టు ఆడుతున్నాడు. అయితే వార్నర్‌కు ఇంగ్లండ్‌ అభిమానుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతూనే ఉంది.

రెండో టీ20.. ఇండియా తుది జట్టు ఇదే!!?

సాండ్‌ పేపర్‌ లేదుగా:

సాండ్‌ పేపర్‌ లేదుగా:

మూడో రోజు ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా బౌండరీ లైన్‌లో వార్నర్‌ ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. ఈ సమయంలో ఇంగ్లాండ్‌ అభిమానులు వార్నర్‌ను మరొకసారి విమర్శించారు. ‘వార్నర్‌ చేతిలో సాండ్‌ పేపర్స్ ఉన్నాయి’ అంటూ భారీ స్థాయిలో నినాదాలు చేశారు. అయితే దీనికి వార్నర్‌ నవ్వుతూనే సమాధానమిచ్చాడు. తన రెండు అరచేతులను అభిమానులకు చూపించాడు. అంతేకాదు.. తన ప్యాంట్‌ జేబులను చూపించి సాండ్‌ పేపర్‌ లేదు అంటూ బదులిచ్చాడు.

శాండ్‌పేపర్‌ చూపిస్తూ:

శాండ్‌పేపర్‌ చూపిస్తూ:

వార్నర్ స్పందన చూసి కొందరు ఇంగ్లాండ్‌ అభిమానులు ఏమి చేయాలో తెలియక నవ్వి ఊరుకున్నారు. మరికొందరేమో అదేవిధంగా నినాదాలు చేశారు. గురువారం తొలి టెస్ట్ మ్యాచ్‌ ఆరంభానికి ముందు జాతీయ గీతాలాపన కోసం ఆసీస్‌ ఆటగాళ్లు వస్తుండగా.. ట్యాంపరింగ్‌ కోసం వాడిన శాండ్‌పేపర్‌ చూపిస్తూ ఇంగ్లండ్‌ అభిమానులు హేళన చేశారు.

మోసగాళ్లు.. మోసగాళ్లు:

మోసగాళ్లు.. మోసగాళ్లు:

వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్ ఓపెనర్లుగా బరిలోకి వెళుతున్నప్పుడు ఇంగ్లిష్‌ అభిమానులు ‘మోసగాళ్లు.. మోసగాళ్లు’ అంటూ నినాదాలు చేశారు. ఇక ఇద్దరు పెవిలియన్‌కు చేర్చినప్పుడు కూడా శాండ్‌ పేపర్‌ చూపిస్తూ పెవిలియన్‌కు సాగనంపారు. ఇక స్టేడియంలో ఓ అభిమాని అయితే ‘ఇంగ్లండ్‌ చాంప్స్‌.. ఆసీస్‌ ఛీట్స్‌’ అనే ప్లకార్డు పట్టుకుని నినాదానాలు చేసాడు. అంతేకాకుండా ఏడుస్తున్నట్లుండే స్మిత్‌ మాస్క్‌ను ధరించారు.

ఉద్రికత్త పరిస్థితులు.. వంద మందికి పైగా క్రికెటర్ల తరలింపు

 ఏడాది నిషేధం:

ఏడాది నిషేధం:

2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సాండ్‌ పేపర్‌తో బాన్‌క్రాఫ్ట్‌ బంతిని రుద్దడం, ఇది వీడియోలో రికార్డు అవ్వడం జరిగిపోయింది. ఈ ఘటనలో కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌, వార్నర్‌ల పాత్ర ఉండడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ముగ్గురిపై ఏడాది నిషేధం విధించింది. నిషేధం అనంతరం స్మిత్‌, వార్నర్‌లు ఐపీఎల్, ప్రపంచకప్‌లలో ఆడాడు. ఇప్పుడు యాషెస్‌ సిరీస్ ఆడుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here