మలిదశ ఉద్యమానికి సన్నద్ధం

0
2


మలిదశ ఉద్యమానికి సన్నద్ధం

నేడు ఆర్మూర్‌లో పసుపు, ఎర్రజొన్న రైతుల సమావేశం

పంటలకు మద్దతు ధర, బోర్డు సాధనే లక్ష్యం

న్యూస్‌టుడే, ఆర్మూర్‌ పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరల సాధన, పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతులు మలిదశ ఉద్యమానికి సమాయత్తమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పెద్దఎత్తున ఉద్యమించడమే కాకుండా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ గళాన్ని బలంగా వినిపించి, డిమాండ్లను జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు. ఇదే పంథాను కొనసాగించి తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. ప్రతిసారి పంట చేతికొచ్చే సమయంలో ఉద్యమించడం, ప్రభుత్వం నుంచి హామీ రాగానే తాత్కాలికంగా విరమించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి అలా కాకుండా తమ డిమాండ్లను సాధించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మలిదశ ఉద్యమ కార్యాచరణపై చర్చించడానికి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ఆదివారం ఆర్మూర్‌లో సమావేశం కానున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని పసుపు, ఎర్రజొన్న రైతులతో చర్చించి పసుపు బోర్డు, మద్దతు ధర కోసం ఉద్యమ రూపాలను ఖరారు చేయనున్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here