మళ్లీ పెరిగిన బంగారం ధరలు: హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లో…

0
1


మళ్లీ పెరిగిన బంగారం ధరలు: హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లో…

రెండు రోజుల క్రితం వరకు దిగి వచ్చిన బంగారం ధరలు కాస్త పెరిగాయి. దసరా, దీపావళి పండుగ సీజన్ కావడంతో ధరలు కాస్త పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగింది. దీంతో రూ.39,460గా ఉంది. గ్లోబల్ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్ ఉండటంతో పాటు దేశీయ జువెల్లర్స్, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరిగింది. ఇది బంగారంపై సానుకూల ప్రభావం చూపింది.

అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ.36,180కి చేరుకుంది. బంగారం ధర పెరిగినప్పటికీ వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కిలో వెండి రూ.50,075 వద్ద ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి స్థిరంగానే ఉంది.

ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరిగి రూ.38,150కు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరిగి రూ.36,950గా ఉంది. వెండి ధర స్థిరంగా ఉంది. కిలో వెండి రూ.50,075గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పడిపోయింది.

బంగారం ధరలు శుక్రవారం నాటికి గత నెల అత్యధిక రికార్డ్ స్థాయితో పోల్చుకుంటే రూ.2600 తగ్గింది. శుక్రవారం ఎంసీఎక్స్‌లో 0.16% తగ్గి రూ.37,310గా ఉంది. ఆగస్ట్‌లో రికార్డ్ హై రూ.39,885 కంటే రూ.2,600 తగ్గింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here