మహాత్ముడి ఆశయసాధనకు కషిచేయాలి

0
1



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్ముని బాటలో ప్రయాణించి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు చేయాలని సర్పంచ్‌ సునీత అన్నారు. మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా మండలంలోని మౌలాలి తండాలో సర్పంచ్‌ సునీత మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్ముడు చూపిన బాటలోనే ప్రతి ఒక్కరు ప్రయాణించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని, గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటం వద్ద తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని పల్లె ప్రగతికి కషి చేస్తామని పాలకవర్గం చేత ప్రతిజ్ఞ చేయించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రవి, ఎంపీటీసీ లక్ష్మీ, రైసస జిల్లా సభ్యుడు మౌలానా, మాజీ సర్పంచ్‌ శంకర్‌, బాబునాయక్‌, అన్వర్‌, లింగారెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here