మహాత్ముని మార్గంలో మనం

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ”మహాత్ముని మార్గంలో మనం” కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌ గ్రామంలో 1.5 కిలోమీటర్ల శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని భీంగల్‌ సిఐ సైదయ్య జెండా ఊపి ప్రారంభించారు. భారతమాత విగ్రహం నుండి ర్యాలీ గా బయలుదేరి గాంధీ విగ్రహం వరకు చేరుకున్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా సిఐ సైదయ్య మాట్లాడుతూ యువత గాంధీ మార్గంలో అహింస, శాంతి, సత్య మార్గంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్రం రావడానికి గాంధీ అహింస మార్గమే కారణమన్నారు. గ్రామంలో ప్లాస్టిక్‌ను తరిమికొట్టి స్వచ్ఛ బషీరాబాద్‌గా తయారు చేసి గాంధీకి నిజమైన నివాళులర్పించాలన్నారు. కమ్మర్‌పల్లి ఎస్‌ఐ ఆసిఫ్‌ మాట్లాడుతూ యువకులు సన్మార్గంలో నడుస్తూ గ్రామ అభివద్ధికి కషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ జిల్లా కోఆర్డినేటర్‌ తక్కూరి హన్మాండ్లు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు గొండల ప్రసాద్‌, సతీష్‌, గ్రామ సర్పంచ్‌ సక్కారం అశోక్‌, ఎంపిటిసి తోట జ్యోతి, విడిసి చైర్మన్‌ మురళీ, ఉప సర్పంచ్‌ విక్రమ్‌, బైకాని మహేష్‌, బోడ దేవేందర్‌, గంగారెడ్డి, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here