మహాన్యాస పూర్వక ఏకాదశ వరుణ యాగం

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం వర్షాలు సరైన సమయంలో లేక తీవ్ర వర్షాభావ పరిస్థితులు సంభవించినందున, భవిష్యత్తులో దీని ప్రభావం వలన తీవ్ర కరువు వచ్చే ప్రమాదం ఉన్నందున ఆ ప్రమాదం నుండి పూర్తిగా కాకపోయినా కొంతవరకు అయిన మన శక్తి మేరకు మన వంతు మానవ ప్రయత్నంగా సష్టిలోని సమస్త జీవ రాశులతో పాటు ముఖ్యంగా పుడమి తల్లిని నమ్ముకొని జీవనం గడుపుతూ మన అందరి ఆకలి తీర్చడం కోసం అహర్నిశలు కష్టపడే రైతులందరు క్షేమంగా ఉండాలనే ఒక మంచి సంకల్పంతో కామారెడ్డి పట్టణ బ్రాహ్మణ వికాస పరిషత్‌ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణం పశ్చిమ హౌసింగ్‌ బోర్డు కాలనీలో శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రము వేదికగా దేవాలయ కమిటీ, కాలనీ వాసుల సహకారముతో, అర్చకులు, పురోహితుల ఆశీస్సులతో ఈనెల 12న ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) శుక్రవారం నుండి 14వ తేదీ ఆషాఢ శుద్ధ త్రయోదశి ఆదివారం వరకు మూడు రోజుల పాటు వైభవంగా మహాన్యాస పూర్వక ఏకాదశ వరుణ (వర్ష) పాశుపత రుద్రాభిషేకం, పార్థివ ఋష్యశంగ మహాముని విశేష అర్చన, నాభిస్థానం వరకు జలాధివాసం చేస్తూ జప అనుష్ఠానము, వరుణ యాగము జరుగును. కార్యక్రమములో భక్తులు సాంప్రదాయ వస్త్ర ధారణలో పాల్గొని అవసరమైన మేరకు వర్షాలు సమద్ధిగా పడాలని తమ శక్తి మేరకు వరుణ దేవుడిని, ఋష్యశంగ మహామునీశ్వరుడిని ప్రార్థన చేసి స్ఫటిక మహా శివలింగము (శ్రీ భవానీ సమేత గ్రహమండలేశ్వర స్వామి) పై మీరు కూడ స్వయంగా జలాభిషేకము చేసి మహాదేవుడి దివ్యాశీస్సులు పొంది కార్యక్రమమును విజయవంతం చేయగలరని కోరుతున్నారు. శుక్ర, శని వారాలు రెండు రోజులు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఋష్యశంగ మహాముని జపము, పాశుపత రుద్రాభిషేకము, విశేష పూజా తదనంతరము తీర్థ ప్రసాద వితరణ ఉంటాయన్నారు. ఆదివారము ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వరుణ యాగము, పూర్ణాహుతి తీర్థ ప్రసాద వితరణ తదనంతరము ఋష్యశంగ మహాముని విగ్రహమును కామారెడ్డి పట్టణ చెరువుకి ఊరేగింపుగా తీసుకెళ్లి గంగ మాతాకీ సౌభాగ్య ద్రవ్యములు సమర్పించిన తరువాత ఋష్యశంగ మహాముని విగ్రహమును చెరువులో నిమజ్జనం చేయడంతో కార్యక్రమం పూర్తవుతుందని పేర్కొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here