మహిళలకు మెరుగైన వైద్యం

0
1


మహిళలకు మెరుగైన వైద్యం

ప్రభుత్వ ఉద్యోగుల తెల్లకార్డులకు నిలిపివేత

అనర్హుల ప్రక్షాళన దిశగా సర్కారు అడుగులు

చిరుద్యోగులను మినహాయించాలని డిమాండ్‌

ఆన్‌లైన్‌లో వినగడప వీఆర్యే రేషన్‌కార్డు ఇన్‌యాక్టివ్‌ చేసిన దృశ్యం

గంపలగూడెం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆగస్టు నుంచి రేషన్‌ నిలిపివేశారు. సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో వేతనాలు అందుకుంటున్న సదరు ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన తెలుపు రంగు రేషన్‌ కార్డులు పనిచేయకుండా ఆన్‌లైన్‌ సమాచారం నిలిపివేశారు. ఆగస్టులో 2, 3 తేదీల్లో చౌకధరల దుకాణాలకు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వెళ్లిన కార్డుదారులకు అక్కడి డీలర్లు సరకులు ఇచ్చేందుకు నిరాకరించారు. అదేమిటని ప్రశ్నించిన లబ్ధిదారులకు ప్రభుత్వం కార్డులను ‘ఇన్‌యాక్టివ్‌’ చేసిందనే సమాధానం వచ్చింది. తమకు అన్యాయం జరిగిందని రెవెన్యూ కార్యాలయానికి పరిగెత్తిన బాధిత కార్డుదారులకు అక్కడా అదే సమాధానం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన రేషన్‌ కార్డులకు సరకులు ఆపేసినట్లు తెలిసింది.

రాష్ట్రంలో సంక్షేమ భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సర్కారు నుంచి వేతనాలు పొందుతూ కూడా రేషన్‌ కార్డులున్న వారిని గుర్తించి ఈ నెల నుంచి వారి కార్డులను  తొలగించారు. కొందరు ఉద్యోగులు తమ తల్లిదండ్రుల కార్డుల నుంచి వైదొలిగనప్పటికి వారికి రేషన్‌ నిలిపివేశారు. ప్రభుత్వ ఉద్యోగులు మూడేళ్ల నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా వేతనాలు పొందుతున్నారు. గతంలో ఖజానాల ద్వారా జీతాలు పొందే విధానాన్ని మార్పు చేసి ఉద్యోగుల ఆధార్‌ సంఖ్యలు, పాన్‌ కార్డులను నమోదు చేస్తూ హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పద్ధతిలోకి మార్చారు. ప్రతి ఉద్యోగికి ఆర్థిక అంశాలు (లావాదేవీల) నిర్వహణకు కొత్తగా గుర్తింపు సంఖ్యలను ఇచ్చారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు ఇంతకు ముందు నుంచి రేషన్‌ కార్డులున్నాయి. వారిలో నెలకు రూ.3 వేలు నురచి రూ.10 వేలలోపు వేతనాలు తీసుకునే చిరుద్యోగులు కూడా ఉన్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కాకపోయినా దారిద్య్రరేఖకు కిందనున్న వారికి అందాల్చిన ఫలాలను పొందుతున్నారు. ఈ నేపధ్యంలో సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదైన ఆధార్‌ సంఖ్యలతో రేషన్‌ తీసుకుంటున్న వారి వివరాలను సరిపోల్చి సంబంధిత రేషన్‌ కార్డులను జాబితా నుంచి తొలగిస్తున్నారు. జిల్లాలో 12,93,529 రేషన్‌కార్డులు ప్రస్తుతం ఉన్నాయి. సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకునే ఉద్యోగులకు సంబంధించి ప్రజాసాధికార సర్వే, ఆధార్‌ సంఖ్య అనుసంధానం ఆధారంగా 50 వేల మందికి పైగా కార్డులకు సరకులను నిలిపివేయొచ్చుని అంచనా ఉంది. శనివారం నుంచే జిల్లా వ్యాప్తంగా ఈ సమస్య వెలుగు చూసింది. గంపలగూడెం మండలంలోని తునికిపాడు, కొణిజెర్ల, గంపలగూడెం తదితర గ్రామల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా వేతనాలు అందుకుంటున్న ఉద్యోగుల కుటుంబాలకు రేషన్‌ సరకులు నిలిపివేశారు. వీరిలో వీఆర్యేలు, పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబాలు అధికంగా ఉన్నాయి.

సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో.. : ప్రస్తుతం రేషన్‌ కార్డులను తొలగించిన వారి జాబితాలో చిరుద్యోగులు అధికమనే చెప్పాలి. మూడేళ్ల నుంచి అన్ని శాఖల్లో పనిచేస్తున్న అన్ని స్థాయిల్లో ఉద్యోగులు సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలోనే వేతనాలు అందుకుంటున్నారు. గ్రామ సహాయకులు, ఐసీడీఎస్‌, ఆశా కార్యకర్తలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఉద్యోగులకు ఇదే విధానం అమల్లో ఉంది. వాస్తవానికి వారికి ఇచ్చే వేతనాలు కుటుంబ జీవనానికి ఏ మూలకూ సరిపోవు. ఆరోగ్య కార్డులున్న ఉద్యోగుల రేషన్‌ కార్డులను కూడా తొలగిస్తున్నట్లు సమాచారం.

ప్రజాసాధికార సర్వే ఆధారంగా.. : కుటుంబ సభ్యులంతా ఒకే రేషన్‌ కార్డులో సభ్యులుగా ఉన్నట్లు ప్రజా సాధికార సర్వేలో నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాక తమ తల్లిదండ్రుల రేషన్‌ కార్డులో సభ్యులుగా ఉండకుండా వైదొలిగారు. ప్రజాసాధికార సర్వే ఆధారంగా ఇప్పటికీ ఆ కుటుంబంలోని సభ్యులుగానే భావించి వారి కుటుంబాలకు సరకులు నిలిపివేశారు. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ రేషన్‌ కార్డులు కలిగి ఉండటం నిబంధనలకు విరుద్ధమనే కారణంగానే కార్డులు పనిచేయకుండా చేశారు.

గ్రామసహాయకులకు రేషన్‌ కార్డు ఉంచాలి

చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. నెలకు రూ.10 వేల వరకు వేతనం లభిస్తుంది. ధరల పెరుగుదల నేపధ్యంలో ఈ వేతనంతో జీవనం సాగించడం ఆర్థికంగా భారంగానే ఉంటోంది. ఇపుడున్న పరిస్థితుల్లో మాలాంటి చిరుద్యోగులకు రేషన్‌కార్డు తొలగిస్తే మా బాధ వర్ణనాతీతమనే చెప్పాలి. ఇప్పటికే వీఆర్వేలు రేషన్‌ కార్డులు తొలగించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. మా రేషన్‌ కార్డును కూడా ఆన్‌లైన్‌లో ఈ నెల నుంచి ఇన్‌యాక్టివ్‌ చేశారు. – జి.గోపాలకృష్ణ, వీఆర్వే గంపలగూడెం

ఆగస్టు నుంచి రద్దు చేశారన్నారు

మా అబ్బాయికి ఐదేళ్లనాడు పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. మా రేషన్‌ కార్డు నుంచి అతన్ని తొలగించాం. ఆగస్టు నెలకు సంబంధించి సరకుల కోసం రేషన్‌ దుకాణానికి వెళితే మా కార్డుకు సరకులు ఇవ్వనని డీలరు చెప్పారు. అదేమిటని ప్రశ్నిస్తే మా కార్డు పనిచేయడం లేదని, రేషన్‌ కూడా బంద్‌ చేశారని చెప్పారు. గంపలగూడెం రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించినా ఇదే సమాధానం వచ్చింది. మా అబ్బాయి వేరుగా ఉంటున్నాడు. రెక్కల కష్టంపై జీవించే మాకు తెలుపు రంగు కార్డే ఆదరవు. మా కార్డు రద్దు చేస్తే ఎలా జీవించాలి. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి.  – ఎస్‌కె.నాగుల్‌మీరా, కార్పెంటర్‌, గంపలగూడెంSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here