మహిళలా ఉద్యోగస్తులకు రష్యా కంపెనీ ఆఫర్ : పొట్టి డ్రస్సులు వేసుకురండి..బోనస్ పొందండి

0
3
 పొట్టి డ్రస్సులు..మేకప్‌తో వస్తే బోనస్

పొట్టి డ్రస్సులు..మేకప్‌తో వస్తే బోనస్

రష్యాలోని ఓ కంపెనీ తన మహిళా ఉద్యోగస్తులకు మాంచి ఆఫర్ ఇచ్చింది. పనివేళల్లో ఆఫీసుకు పొట్టి దుస్తులు వేసుకుని మంచి మేకప్ వేసుకుని వచ్చే వారికి బోనస్‌లు ప్రకటించింది. అసలే అందంగా కనిపించాలని ఆలోచించే అమ్మాయిలకు ఈ ఆఫర్ తెగ నచ్చేసింది. కంపెనీ ప్రకటించడమే ఆలస్యం… అంతా బ్యూటీ పార్లర్లకు పరుగులు తీసి తమ అందానికి మరింత మెరుగు పెట్టారు. మేకప్‌ వేసుకున్నారు. ఇక కంపెనీ యాజమాన్యం చెప్పినట్లుగానే పొట్టి డ్రస్సులు వేసుకుని వయ్యారం పోయారు. ఇక వీరందరినీ ఒక మారథాన్‌లో పాల్గొనాల్సిందిగా కంపెనీ ఆదేశించింది.

ఐదు సెంటీమీటర్లు మించకుంటే 100 రూబెల్స్ బోనస్

ఐదు సెంటీమీటర్లు మించకుంటే 100 రూబెల్స్ బోనస్

ఇక డ్రెస్సులు ఎంత పొడవుండాలో కూడా కంపెనీ యాజమాన్యం ముందుగానే చెప్పేసింది. మోకాళ్ల నుంచి 5 సెంటీమీటర్లకంటే ఎక్కువగా పొడవు ఉండరాదని వెల్లడించింది.ఇలా దుస్తులు ధరించిన వారికి ఒక రేటు ఫిక్స్ చేసింది. ఐదు సెంటీమీటర్ల వరకు డ్రెస్సులు ధరించే మహిళా ఉద్యోగస్తులకు 100 రూబెల్స్ ఇస్తామని తెలిపింది. ఇది తమ జీతభత్యాలకు అదనంగా ఇస్తామని స్పష్టం చేసింది. అయితే మహిళా ఉద్యోగినులు నిజంగానే పొట్టి డ్రస్సులు ధరించారని తెలుసుకునేందుకు ఓ ఫోటో తీసి కంపెనీకి పంపాలనే నిబంధన విధించింది.

 ఆఫర్ పై కంపెనీ ఇచ్చిన వివరణ ఇదీ..!

ఆఫర్ పై కంపెనీ ఇచ్చిన వివరణ ఇదీ..!

ఇలాంటి ఆఫర్ ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో కంపెనీ యాజమాన్యం వివరించింది. కంపెనీలో 70శాతం మంది పురుషులే ఉన్నారట. ఇక మారథాన్‌లో మహిళలు పొట్టి డ్రస్సులు వేసుకుని పాల్గొంటే వారికి భయం అనేది పోతుందని కంపెనీ తెలిపింది. మగవారితో కలిసి పనిచేసేందుకు ఈ తరహా పద్దతులు పనికొస్తాయని వెల్లడించింది. చాలామంది ప్యాంట్లు వేసుకుని వస్తారని ఇలాంటి ఆఫ్లర్లు ఇస్తే వారు పొట్టిడ్రస్సులు వేసుకున్న సమయంలో వారు ఆడవారు అనే విషయం వారికి తెలిసొస్తుందని యాజమాన్యం చెప్పుకొచ్చింది. అంతేకాదు పొట్టి డ్రస్సులు , లేదా స్కర్ట్‌లు వేసుకున్న సమయంలో వారికి తెలిసొస్తుందని చెప్పింది. అయితే కంపెనీపై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here