మహిళలు ఆర్థికంగా ఎదగాలి

0
0


మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మంత్రి ప్రశాంత్‌రెడ్డి

బాల్కొండ, న్యూస్‌టుడే: మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర రహదారులు, భవనాలు శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం బాల్కొండలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా స్త్రీశక్తి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలు మగవారిలా డబ్బు దుబారా చేయకుండా పైసా పైసకు లెక్క కడుతూ ఆదా చేస్తారని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం రుణాలు అందజేస్తుందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ వ్యాపారాలు ప్రారంభించాలని చెప్పారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతులపై మరింత ప్రత్యేక శ్రద్ధ తెరాస ప్రభుత్వం తీసుకోనుందని పేర్కొన్నారు. రూ.1700 కోట్లతో చేపట్టిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా మరో వారం రోజుల్లో కాళేశ్వరం నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి నీరు రానుందని చెప్పారు. బాల్కొండలో రూ.32 లక్షలతో నిర్మించిన స్త్రీశక్తి భవనాన్ని, రూ.60 లక్షలతో నిర్మించిన నియోజకవర్గ స్థాయి పశు సంవర్ధక శాఖ రైతు శిక్షణ కేంద్రం భవనాన్ని, రూ.35 లక్షలతో చేపట్టిన పంచాయతీరాజ్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. స్త్రీశక్తి భవనం ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.17లక్షలతో షెడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఆసుపత్రిని సందర్శించారు. వార్డులోకి వెళ్లి అమ్మఒడిలో ప్రసవం చేయించుకున్న వారితో మాట్లాడారు. కేసీఆర్‌ కిట్టు అందజేశారు. ఈ  కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య, జడ్పీటీసీ సభ్యురాలు దాసరి లావణ్య, సర్పంచి సునీత, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌, ఎంపీటీసీ సభ్యులు, తెరాస మండలాధ్యక్షుడు దాసరి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here