మహిళలు మగాడిని గ్యాంగ్ రేప్ చేస్తేనే సమానత్వం.. నోరుజారిన సినీ రచయిత

0
3


పాకిస్థాన్‌ సినీ రచయిత ఖాలీల్ ఉర్ రెహ్మాన్ కమర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ఆయన రచించిన ‘మేరా పాస్ తుమ్ హో’ డ్రామా గురించి ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడారు. తన కథలో మహిళలు తమ బాస్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని.. భర్తలను ఎలా మోసం చేస్తారనేది చెప్పానని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన లింగ సమానత్వం (Gender equality) గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్‌లో నాకంటే గొప్ప స్త్రీవాదిని మీరు ఎక్కడ చూడలేరు. మహిళలకు సమాన హక్కులు ఉండాలని కోరుకొనేవాడిలో నేనూ ఒకడిని. ఎవరైనా నన్ను స్త్రీల సమానత్వం గురించి ప్రశ్నిస్తే.. ఒకటే అడుగుతా. మీరు ఒక మహిళను ఐదుగురు కిడ్నాప్ చేసిన వార్త ఎప్పుడైనా విన్నారా? అని ప్రశ్నిస్తా. ఇందుకు వారు అవును అని సమాధానం చెబుతారు. ఆ వెంటనే నేను మహిళలు మగాడిని కిడ్నాప్ చేసే వార్త విన్నారా అని అడుగుతా’’ అని అన్నారు.

Also Read: 15 ఏళ్ల బాలుడిని 20 సార్లు రేప్ చేసి.. కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

‘‘మహిళలు సమానత్వం కావాలంటే.. పురుషులు చేస్తున్నవే చేయాలి. బస్సుల్లోకి చొరబడి దోపిడీలు చేయాలి. మహిళలు.. పురుషుడిని ఎత్తుకుపోయి గ్యాంగ్ రేప్ చేయాలి. అప్పుడే స్త్రీలకు సమానత్వం వచ్చిందని నమ్ముతా’’ అని తెలిపారు. మహిళలకు తమ హక్కుల గురించి తెలీదు. వారికి ఎప్పుడూ దక్కని పురుష హక్కులను పొందేందుకే చూస్తుంటారు. మహిళలు పొట్టి దుస్తులు వేసుకోడానికి అనుమతించకూడదు’’ అని అన్నారు.

ఖాలీల్ ఉర్ రెహ్మాన్ కమర్ వివాదాస్పద ఇంటర్వ్యూ ఇదే:

‘‘పురుషులు మోసం చేయడానికి కారణం.. మహిళలు చేస్తున్న తప్పులే. భర్తలు తమ భార్యలను మోసం చేసేలా టెంప్ట్ చేసేది మహిళలే. మహిళలు.. పురుషులను లోబరుచుకుని వారి వివాహ బంధాన్ని నాశనం చేస్తారు’’ అని తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. సోషల్ మీడియాలో కమర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Also Read: లైవ్‌లో మాట్లాడుతూ.. పర్వతం పైనుంచి పడ్డ వ్యక్తి, కెమేరాలో రికార్డైన ఘటన!Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here