మహిళల భద్రతకు పటిష్ఠ చర్యలు: సీపీ

0
3


మహిళల భద్రతకు పటిష్ఠ చర్యలు: సీపీ

షీ టీం ప్రచార కరపత్రాలను విడుదల చేస్తున్న సీపీ, ఇతర అధికారులు

ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: కమిషనరేట్‌లో మహిళల భద్రత కోసం పటిష్ఠ చర్యలు తీసుకొంటున్నామని సీపీ కార్తికేయ తెలిపారు. అదనపు డీసీపీ శ్రీధర్‌ రెడ్డితో కలిసి మంగళవారం తన ఛాంబర్‌లో షీ టీంల ప్రచార కరపత్రాలు, స్టిక్కర్లను సీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమిషనరేట్‌లో షీ బృందాలు చక్కగా పనిచేస్తున్నాయన్నారు. భవిష్యత్తులో ఈవ్‌టీజింగ్‌కు తావులేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చేలా ప్రచార సామగ్రిని పంపిణీ చేశామన్నారు. విద్యార్థినులు, మహిళలు షీ టీంలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. చరవాణి నంబర్లను ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌ రావు, ఎస్‌బీ సీఐ మధుసూదన్‌, నగర సీఐ నరేశ్‌, ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here