మహిళల భద్రతకే షీ బృందాలు

0
3


మహిళల భద్రతకే షీ బృందాలు


కరపత్రాలను ఆవిష్కరిస్తున్న సీఐ రాఘవేందర్‌, షీ టీమ్‌ ఎస్సై ఐకే రెడ్డి

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: మహిళలకు భద్రత, వేధింపులను అరికట్టేందుకే షీ బృందాలున్నాయని షీ టీమ్‌ ఎస్సై ఐకే రెడ్డి తెలిపారు. ఆర్మూర్‌ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం ఈవ్‌ టీజింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్మూర్‌ సీఐ రాఘవేందర్‌ పాల్గొని ఇబ్బందులు ఎదురైతే ఎలా స్పందించాలో ప్రయోగ పూర్వకంగా వివరించారు. వేధింపులకు గురైన వారు ఫిర్యాదు చేస్తే నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానాచార్యురాలు పుష్పాంజలి, అధ్యాపకులు సుజాత, ధనవేణి, బాలమణి, షీ బృందం సభ్యురాలు సుమతి పాల్గొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here