మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం

0
2


మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం

ఎంపీ ధర్మపురి అర్వింద్‌


జక్రాన్‌పల్లి మండలం నూర్‌సింగ్‌తండాలో తీజ్‌ వేడుకలు

రూప్లానాయక్‌తండా(ఇందల్‌వాయి), న్యూస్‌టుడే: ప్రధాని మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యమిస్తుందని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పేర్కొన్నారు. ఇందల్‌వాయి మండలం రూప్లానాయక్‌తండాలో ఆదివారం నిర్వహించిన తీజ్‌ వేడుకలకు ఆయన పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. సేవాలాల్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యువతులకు తీజ్‌ బుట్టలు అందజేశారు. సర్పంచి అరుణ ఆరుగురు వార్డు సభ్యులు, ఇతర నాయకులతో కలిసి భాజపాలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో మొదటిసారిగా 78 మంది మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. ప్రజల ఆదరణతో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాషయ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లాధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బస్వలక్ష్మీనారాయణ, సురేష్‌, జిల్లా నాయకుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు బిక్కునాయక్‌, మండలాధ్యక్షుడు నాయిడి రాజన్న, రూరల్‌ అసెంబ్లీ కన్వీనర్‌ కేపీరెడ్డి, ఉపసర్పంచి లలిత తదితరులు పాల్గొన్నారు.

అండర్‌-19 టోర్నీకి ఎంపికైన జట్టుతో కోచ్‌ శైలజ్‌, సంఘ సభ్యులు

 

స్వీయచిత్రం తీసుకుంటున్న బంజారా యువతులు

 

భాజపాలో చేరిన పాలకవర్గ సభ్యులతో ఎంపీ అర్వింద్‌

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here