మాటిచ్ఛా. నిలబెట్టుకొన్నా: సభాపతి

0
2


మాటిచ్ఛా. నిలబెట్టుకొన్నా: సభాపతి

మాట్లాడుతున్న సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ పట్టణం, న్యూస్‌టుడే: రుణాలు మాఫీ చేయించి ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నానని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని బీడీ వర్కర్స్‌కాలనీలో ఆదివారం రుణ విముక్తి లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాలనీలో పర్యటించినప్పుడు ఇంటి కోసం తీసుకొన్న రూ.లక్ష రుణం కట్టలేకపోతున్నామని తన దృష్టికి తెచ్చారని, అనేక ప్రయత్నాలు చేసి 42 మంది లబ్ధిదారులకు మాఫీ చేయించగలిగానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇంటి నిర్మాణానికి రూ.70 వేలు మాత్రమే ఇవ్వడంతో కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని, 2013లో రుణాలు ఇప్పించడానికి అప్పటి బ్యాంకు అధికారులతో మాట్లాడానని పేర్కొన్నారు. అనంతరం ఇచ్చిన మాట ప్రకారం మాఫీ చేయడానికి సీఎం, ప్రధాన కార్యదర్శులతో మాట్లాడానన్నారు. అసాధ్యమనుకున్న దానిని సాధ్యం చేసి చూపించానని పేర్కొన్నారు. అనంతరం రుణ విముక్తి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

పది మంది ఎంపీడీవోలకు శిక్షణ

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: జిల్లాలోని పది మంది ఎంపీడీవోలు అయిదు రోజుల పాటు శిక్షణకు హైదరాబాద్‌ వెళ్లనున్నారు. ఈ నెల 6 నుంచి నుంచి 10 వరకు రాజేంద్రనగర్‌లోని శిక్షణ కేంద్రంలో కొత్త పంచాయతీరాజ్‌ చట్టం గురించి నిపుణులు శిక్షణ ఇస్తారు. శిక్షణకు వెళ్తున్న ఎంపీడీవోలు గోపిబాబు(ఆర్మూర్‌), సంతోష్‌ కుమార్‌(బాల్కొండ), నట్‌రాజ్‌(ధర్పల్లి), సురేందర్‌(డిచ్‌పల్లి), రాములు నాయక్‌(ఇందల్వాయి), భారతి(జక్రాన్‌పల్లి), దామోదర్‌(ముప్కాల్‌), గోపాల కృష్ణ(రెంజల్‌), బాల గంగాధర్‌(రుద్రూర్‌), శ్రీనివాస్‌ రావు(సిరికొండ) ఉన్నారు. వీరు తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శులకు జిల్లాలో శిక్షణ ఇవ్వనున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here