మారుతీ సుజుకీ సేల్స్ అంచనాలో 20% తగ్గుదల, అదే అతిపెద్ద ఆందోళన

0
0


మారుతీ సుజుకీ సేల్స్ అంచనాలో 20% తగ్గుదల, అదే అతిపెద్ద ఆందోళన

ముంబై: అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సేల్స్ అంచనాను సుజుకీ మోటార్స్ కార్పోరేషన్ (SMC) సవరించింది. తొలి క్వార్టర్లో సేల్స్ భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో ఈ ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరంపై పడుతుందని, ఈ నేపథ్యంలో 20 శాతం పడిపోతాయని అంచనా వేసింది. అంతకుముందు ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 4 శాతంగా ఉంటుందని భావించింది. ఇప్పుడు దానిని సవరించింది.

సెప్టెంబర్ నెలతో ముగిసిన తొలి అర్ధ సంవత్సరంలో అంచనాల కంటే సేల్స్ 25 శాతం పడిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ సేల్స్ 17 శాతం తగ్గాయి. ప్రస్తుతం ఆటో పరిశ్రమ కాస్త కోలుకుంది. అయినప్పటికీ మొత్తం ఆర్థిక సంవత్సరం పరంగా సేల్స్ పడిపోతాయని అంచనా వేస్తోంది.

మొదటి త్రైమాసికం ఫలితాల నేపథ్యంలో SMC ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆదాయం, నిర్వహణ ఆదాయం, నికర ఆదాయ అంచనాను వరుసగా 10.3 శాతం, 39.4 శాతం, 30 శాతం సవరించింది. మోటార్ సైకిల్స్ సేల్స్ గతంలో అంచనా వేసిన దాని కంటే 3 శాతం తగ్గి, 1.77 మిలియన్లుగా ఉంటాయని భావిస్తోంది.

మారుతీ సుజుకీ సేల్స్ అక్టోబర్ నెలలో పుంజుకున్నాయి. ఓ వైపు మార్కెట్లో కొన్ని సేల్స్ పెరగనప్పటికీ ఈ సంస్థ సేల్స్ మాత్రం పెరిగాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఆరునెలల్లో 25 శాతం సేల్స్ తగ్గాయని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు.

అక్టోబర్ నెలలో దసరా, దీపావళి, ధనతెరాస్ పండుగల సందర్భంగా సేల్స్ భారీగా పెరిగాయి. అయితే మారుతీ సుజుకీకి ఆందోళన కలిగించే విషయం ఏమంటే ఈ కంపెనీకి అతి ఎక్కువ రెవెన్యూ వచ్చే మినీ కార్ సెగ్మెంట్ సేల్స్ 53 శాతం తగ్గాయి.

మారుతీ సుజుకీ నిదానంగా మార్కెట్‌ను పెంచుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మందగమనం, పెరుగుతున్న వ్యయం కారణంగా లాభాలు కొంత తగ్గాయి. మారుతీ సుజుకీ మంత్లీ సేల్స్ గత కొన్నాళ్లుగా 1.6 లక్షల నుంచి 1 లక్ష యూనిట్లకు పడిపోయాయి.

12 నెలల కాలంలో మారుతీ సుజుకీ ట్రేడింగ్ అంచనాల కంటే 30 రెట్లు పెరిగింది. పేరెంట్ SMC కంటే రెండు రెట్లు ఉంది. మారుతీ సుజుకీ స్టాక్స్ గత మూడు నెలల్లో 38 శాతం పెరిగాయి. అదే సమయంలో పేరెంట్ SMC 28 శాతం మాత్రమే పెరిగింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here