మార్కెట్లు డౌన్… ఈ షేర్లు మాత్రం దూసుకు పోయాయ్… అవేంటో తెలుసా?

0
0


మార్కెట్లు డౌన్… ఈ షేర్లు మాత్రం దూసుకు పోయాయ్… అవేంటో తెలుసా?

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని చాలామంది తహతహ లాడుతుంటారు. అతి తక్కువ కాలంలోనే అత్యధిక సొమ్మును ఆర్జించడానికి స్టాక్ మార్కెట్ మంచి మార్గమని భావిస్తారు. కొంతమంది స్టాక్ మార్కెట్ గురించి అన్ని విషయాలు తెలుసుకొని ట్రేడింగ్ లోకి దిగితే మరికొంత మంది మాత్రం మిడిమిడి జ్ఞానంతో స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశిస్తారు. ఇలాంటి వారు పెట్టుబడులు పెట్టె కొన్ని షేర్లు గుడ్డి దెబ్బ మాదిరిగా ఎప్పుడో ఒకసారి పెరిగి లాభాలను పంచుతాయి. మిగతా సందర్భంలో వల్ల ఖాతాల్లోని సొమ్మును ఖాళీ చేస్తాయి. గత కొన్ని నెలల కాలంలో ఇదే జరిగింది. పరిణామాల కారణంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేసుకున్నాయి. దీని ఫలితంగా ఇన్వెస్టర్లు బాగా నష్టపోయారు.

20 నెలల్లో 90 శాతం షేర్లు..

* గత 20 నెలల కాలంలో దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికలు, డాలర్ మారకంలో రూపాయి విలువలతో హెచ్చుతగ్గులు, ముడిచమురు ధరలు, అమెరికా – చైనా, భారత్ – చైనా మధ్య వాణిజ్య యుద్ధాలు, బడ్జెట్లు, 370 ఆర్టికల్ రద్దు , యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం, భారత రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్లను తగ్గించడం వంటివి వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బాగా హెచ్చుతగ్గులకు గురయ్యాయి.

* బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లోని దాదాపు 90 శాతం షేర్లపై దెబ్బ పడింది. చాలా కంపెనీల మార్కెట్ విలువ దాదాపు 99 శాతం తుడిచిపెట్టుకు పోయింది.

* ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలోను కొన్ని కంపెనీల షేర్లు మాత్రం ఇన్వెస్టర్ల సంపాదను భారీగా పెంచాయి.

* రసాయనాలు, వినియోగదారు ఆహారం, ఫార్మా, షిప్పింగ్, టెలికాం, ఎంబీఎఫ్సీ వంటి రంగాల్లోని కొన్ని కంపెనీలు ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి.

ఆ షేర్లు ఇవే…

* మార్కెట్లో ప్రతికూలత ఉన్నప్పటికి తమ వ్యాపారంలో సత్తా ఉండటంవల్ల కొన్ని కంపెనీల షేర్లు రాకెట్ స్పీడ్ తో దూకుసు పోయాయి.

* వీటిలో ఆక్వా కల్చర్ సీ ఫుడ్ ఉత్పత్తులను అందిస్తున్న కోస్టల్ కార్పొరేషన్ షేరు ధర జనవరి 1న రూ.16.90 గా ఉంది. ఆగష్టు 7వ తేదీ నాటికీ ఇది రూ. 249 కి చేరుకుంది. రూ. 1,370 శాతం పెరిగింది.

* గ్రాండ్యుయర్ ప్రొడక్ట్స్ 557 శాతం, లీడింగ్ లీసింగ్ ఫైనాన్స్ 549 శాతం, డార్జిలింగ్ రోప్ వే 530 శాతం పెరిగాయి.

* టియాన్ ఆయుర్వేదిక్, సతియా ఇండస్ట్రీస్, క్యాపిటల్ ఇండియా, ఉగ్రో క్యాపిటల్, ప్రోప్రైటర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ షేర్లు 200-500 శాతం వరకు పెరిగాయి.

* మాయిస్ట్రోస్ ఎలక్ట్రానిక్స్, అపోలో ఫిన్ వెస్ట్, ఈస్ట్ వెస్ట్ హోల్డింగ్స్, జంప్ నెట్ వర్క్స్ , సాధన నిట్రో కేమ్, ఐఓఎల్ కెమికల్స్, కవిట్ ఇండస్ట్రీస్, రెస్పాన్స్ ఇండస్ట్రీస్, ప్రభాత్ టెక్నాలజీస్, వాలియంట్ ఆర్గానిక్స్, సీమెక్ వంటి షేర్లు 100 శాతానికి పైగా పెరిగాయి.

* జ్యోతి జెసిన్స్, వినతి ఆర్గానిక్స్, ఎన్ ఐ ఐ టీ టెక్నాలజీస్ వంటి కంపెనీల షేర్లు 2018 జనవరి ఒకటి నుంచి 2019 ఆగస్టు 7వ తేదీ వరకు 90 శాతానికి పైగా పెరిగాయి.

* పెట్టుబడులు పెట్టె ముందు ఇన్వెస్టర్లు కంపెనీలకు సంబంధించిన చరిత్ర, వ్యాపారంలో ఉండే లాభాలు, వృద్ధికి అవకాశాలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here