మార్కెట్లోకి ‘జఫ్ఫా’ కేకులు.. ఎక్కడ దొరుకుతాయో తెలుసా?

0
3


ఫ్ఫా.. అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది హాస్య నటుడు బ్రహ్మానందమే. ఆ పేరుతో ఆయన ఏకంగా సినిమాయే తీసేసిన సంగతి తెలిసిందే. బ్రహ్మనందం..ఊతపదంగా వాడిన ఆ మాట తెలుగు తిట్ల డిక్షనరీలో ఎప్పుడో చేరిపోయింది. మరి, ఆ మాటకు అర్థం ఏమిటీ? ఆ పదం నిజంగా తిట్టేనా? అనే అనుమానం మాత్రం తెలుగు ప్రజల్లో అలాగే ఉండిపోయింది.

జఫ్సా పదంతో ఏకంగా ఓ వంటకమే సిద్ధమైంది. ట్విస్ట్ ఏమిటంటే ఈ ఆహారం తయారువుతున్నది ఇండియాలో కాదు. ఇంకెక్కడా అనుకుంటున్నారా? వీటిని తినాలంటే మీరు చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఐర్లాండులోని ఆంట్రిమ్ కౌంటీకి వెళ్లాలి. మరి, మన ‘జఫ్ఫా’ అక్కడికి ఎలా చేరిందో తెలుసుకోవాలంటే.. ‘జఫ్ఫా’ గురించి ముందుగా తెలుసుకోవాలి.

Read also: ఈ ఇడ్లీలు మూడేళ్లైనా ఫ్రెష్‌గానే ఉంటాయ్! ఎలాగంటే..

‘జఫ్ఫా’ అనేది తిట్టు కాదు. ఇజ్రాయెల్‌ సముద్ర తీరంలో ఉన్న ఓ పోర్టు సిటీ పేరు. అయితే, ఇలాంటి నగరం ఒకటి ఉందని తెలుగు ప్రజలకు తెలియకపోవడం, బ్రహ్మీ దాన్ని ఊతపదంగా మార్చుకుని, అందరినీ జఫ్ఫాగాళ్లని తిట్టడంతో అంతా దాన్ని బూతుల జాబితాలో కలిపేశారు.

హాలోవీన్, క్రిస్మస్ పండుగలను పురస్కరించుకుని కో ఆంట్రిమ్‌లోని ఓ చిప్ షాప్ సరికొత్తగా వంటకంతో కస్టమర్లను సర్‌ప్రైజ్ చేయాలని భావించింది. ఈ సందర్భంగా కప్ కేకుల్లో చాక్లెట్ క్రీమ్‌ను పెట్టి నూనెలో దోరగా వేయించి ఓ సరికొత్త కేకును సిద్ధం చేసింది. ఆ కేకు పేరే ‘జఫ్ఫా కేక్’.

Read also:
‘కింగ్’ వైభోగం.. నాగార్జున గురించి కళ్లు చెదిరే వాస్తవాలు!

ఈ కేకును తమ స్టోర్‌కు వచ్చే కస్టమర్లకు ఉచితంగా పంచుతూ ఆకట్టుకుంటోంది. అయితే, దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. కేకును నూనెలో వేయించడం ఏమిటీ అని చిరగ్గా ముఖం పెడుతుంటే, మరికొందరు భలే రుచిగా ఉన్నాయని మెచ్చుకుంటున్నారట. అయితే, ఈ కేకుల పేరుకు జఫ్ఫా పేరునే ఎందుకు సెలక్ట్ చేసుకునేరనేది తెలియలేదు. తెలిసి పెట్టారో.. తెలియక పెట్టారో తెలీదుగానీ, ఈ కేకుకు ఆ పేరు కరక్టే అనిపిస్తోంది. మరి, దీనిపై మీరేమంటారు?

Photo Credit: The Sun OnlineSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here