మార్కెట్ జోరు: 39,000కు పైగా సెన్సెక్స్, 330 పాయింట్ల లాభంలో నిఫ్టీ

0
4


మార్కెట్ జోరు: 39,000కు పైగా సెన్సెక్స్, 330 పాయింట్ల లాభంలో నిఫ్టీ

ముంబై: షేర్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గత శుక్రవారం ఊహించని లాభాలతో ముగిసిన మార్కెట్లు ఈ రోజు ప్రారంభాన్ని కూడా అదే విధంగా కొనసాగించాయి. ఉదయం గం.9.42 సమయానికి సెన్సెక్స్ 762 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 226 పాయింట్లు లాభపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.15 వద్ద ఉంది. మధ్యాహ్నం గం.11.15 నిమిషాల నాటికి సెన్సెక్స్ 1,087.34 (2.86%) పాయింట్లు లాభపడి 39,101.96 వద్ద, నిఫ్టీ 331.30 (2.94%) పాయింట్లు లాభపడి 11,605.50 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.11.40 నిమిషాలకు సెన్సెక్స్ దాదాపు 1250 పాయింట్ల లాభానికి చేరువైంది. నిఫ్టీ 360 పాయింట్ల జోరుతో ఉంది.

కార్పోరేట్ ట్యాక్స్, జీఎస్టీ మండలి నిర్ణయాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు అదే జోరు కొనసాగించాయి. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు నేపథ్యంలో బాటా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ వంటి దాదాపు 20 స్టాక్స్ భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మెరుస్తున్నాయి. హోడీ మోడీ కార్యక్రమంలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం ప్రభావం కూడా ఉంటుంది.

గం.11.00 సమయానికి నిఫ్టీలో ఏషియన్ పేయింట్స్, ఐటీసీ, లార్సన్, బ్రిటానియా, బీపీసీఎల్ స్టాక్స్ లాభపడగా, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్, యస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. రిలయన్స్ కేపిటల్ 9 శాతం నష్టపోయింది. 20 ఏళ్ల క్రితం నాటికి అంటే 19 మార్చి 1999 నాటి కంటే కిందకు దిగజారడం గమనార్హం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here