మార్పుకు స్వాగతం.. `ఖైదీ` సూపర్‌ అన్న మహేష్

0
1


కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఖైదీ. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుక వచ్చిన ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మారథం పడుతున్నారు. కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం సక్సె్స్‌ను ఎంజాయ్ చేస్తున్న ఖైదీ టీంపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

తాజా ఈ సినిమాపై సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు స్పందిచాడు. శుక్రవారం సినిమా చూసిన మహేష్‌ ట్విటర్‌ ద్వారా తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఖైదీ టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన మహేష్. `ఖైదీ.. న్యూ ఏజ్‌ ఫిలిం మేకింగ్. గ్రిప్పింగ్‌ స్క్రిప్ట్‌లో అద్భుతమైన నటన, థ్రిల్లింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు చాలా బాగా కుదిరాయి. పాటలు లేకపోవటం.. ఓ కొత్త సాంప్రదాయానికి స్వాగతం పలికాయి. ఖైదీ టీం అందరికీ శుభాకాంక్షలు` అన్నారు.
Also Read: Upasana కామెంట్ చేసిందా నాకు తెలీదే: రామ్ చరణ్

మహేష్‌ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా ఏళ్ల తరువాత ఈ సినిమాతో విజయ శాంతి రీ ఎంట్రీ ఇస్తుండంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్రీ కరణ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా రివ్యూ

మానగరం ఫేం లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమాలో కార్తి, హరీష్ ఉత్తమన్‌, నరైన్ కుమార్, ధీన, జార్జ్ మర్యా్న్‌లు కీలక పాత్రల్లో నటించారు. పదేళ్ల శిక్ష తరువాత జైలు నుంచి విడుదలైన ఓ ఖైదీ తన కూతురిని చూసేందుకు పడే తాపత్రేయం.. ఆ ప్రయాణంలో ఓ ఖైదీ వందల మందితో పోరాడాల్సి రావటంతో అనే విభిన్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. కేవల ఓ రాత్రి నాలుగు గంటల వ్యవధిలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

మహేష్ బాబుతో పాటు మెగా డాటర్‌ నిహారిక కూడా ఖైదీ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఖైదీకి సంబందించిన ప్రతీ విషయం నచ్చింది. కార్తి కిల్లర్‌ యాక్టింగ్‌.. లోకేష్‌ ఇంట్రస్టింగ్‌ నేరేషన్, సామ్‌ సీ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్ అంటూ ట్వీట్ చేసింది నిహారిక.
Also Read: ‘ఆవిరి’ సినిమా రివ్యూSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here