మా మ్యారేజ్ సక్సెస్ అవ్వడానికి సీక్రెట్ అదే: మహేశ్ బాబు

0
1


టాలీవుడ్‌లో ఉన్న క్యూటెస్ట్ జోడీల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమత్ర శిరోద్కర్‌ల జంట ఒకటి. వీరిద్దరికి పెళ్లై 14 ఏళ్లు అవుతోంది. ఈ 14 ఏళ్లలో ఇప్పటివరకు మహేశ్‌కు నమ్రతకు మధ్య మనస్పర్ధలు వచ్చింది లేదు. తమ మ్యారేజ్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమేంటో మహేశ్ వెల్లిడించారు. ఇటీవల ఆయన ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్‌కు ఫొటో షూట్ ఇచ్చారు. ఈ సందర్భంగా తన సినిమాల గురించి వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్వ్యూలో మాట్లాడారు.

READ ALSO: 20 ఏళ్ల తర్వాత.. అదే బికినీలో.. అంతే సెక్సీగా..

‘నేను నమ్రత పెళ్లి చేసుకుని 14 ఏళ్లు అవుతోంది. మా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఇద్దరం మాకు నచ్చినట్లుగానే ఉంటాం. మా పెళ్లి ఇంత సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ప్రధాన కారణం అదే. ఆ తర్వాత మా పిల్లలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మా పిల్లల్ని చూశాకే అర్థమైంది. ఈ విషయాన్ని నేను నాన్న నుంచి నేర్చుకున్నాను. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఓ స్టార్ హోదాతో రారు. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో నేను సినిమాల్లో నటించేవాడిని. నా తండ్రి ఎలా నటించాలో శిక్షణ ఇచ్చేవారు. ఓ స్టార్ కిడ్‌ని కావడంతో ఆయన శిక్షణ కాకుండా మరేదీ నన్ను ఇంత బాగా నటించేలా చేసేది కాదేమో’ అని వెల్లడించారు.

నమ్రత శిరోద్కర్ మాట్లాడుతూ.. ‘ఇంత డిసిప్లైన్డ్‌గా ఇంత డెడికేటెడ్‌గా ఉండే వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. ఎంత ఉన్నా కూడా ఇది చాలులే అని సరిపెట్టుకుని ఉండిపోయే వ్యక్తి కాదు మహేశ్. పర్సనల్ జీవితాన్ని, ప్రొఫెషనల్ జీవితాన్ని సమానంగా బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ ఆయనలో ఉంది’ అన్నారు.

READ ALSO: అవార్డ్స్ షోలో మాజీ ప్రియుడిని తిట్టిన Anushka

2000లో వచ్చిన ‘వంశీ’ సినిమాలో మహేశ్, నమత్ర జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. గౌతమ్, సితార. ప్రస్తుతానికైతే ఇద్దరూ చదువుకుంటున్నారు. గౌతమ్ మాత్రం చిన్న వయసులోనే తన తండ్రి నటించిన సినిమాలో నటించేశాడు. మహేశ్ నటించిన నేనొక్కడినే సినిమాలో గౌతమ్ మహేశ్ చిన్నప్పటి పాత్రలో నటించాడు. మరి తన కొడుకును కూడా తనలాగే స్టార్‌ని చేస్తాడో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం పిల్లలకు దసరా సెలవులు కావడంతో మహేశ్ కుటుంబం స్విట్జర్లాండ్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది.

View this post on Instagram

At the core of ur soul there is only pure love 💕 💕💕

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

View this post on Instagram

Up in the mountains… a walk in the clouds…my favourite place !! With the people I love 💗 couldn’t ask for more 😍😍😍 life is beautiful 🥰🥰

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

View this post on Instagram

Friendships usually begin with small talk ending in long conversations… blossom when laughs are shared and memories are made… 😊😍 It stays solid when you grow together as a family… ♥♥ that’s us for you!! 😍😍 #happyfriendshipday

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

View this post on Instagram

He’s always got my back 😍😍😍#loveunconditional #lifeisbeautiful #hapiness #gratitude

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here