మియామి వీధుల్లో ‘విరుష్క’ జంట చక్కర్లు.. అభిమానులతో సెల్ఫీలు

0
1


మియామి: వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో మియామి వీధుల్లో చక్కర్లు కొడుతూ షికార్లు చేస్తున్నాడు. వెస్టిండీస్‌ పర్యటన కోసం టీమిండియా ఇప్పటికే ఫ్లోరిడా చేరుకుంది. వెస్టిండీస్‌, టీమిండియా మధ్య తొలి టీ20 శనివారం జరగనుంది. తొలి టీ20కి సమయంలో ఉండడంతో కోహ్లీ ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూ.. మరోవైపు భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

పిల్లలతో కలిసి కోహ్లీ ఎంజాయ్:

బుధవారం విరాట్‌ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి మియామి వీధుల్లో చక్కర్లు కొట్టాడు. స్నేహితులతో కలిసి ఇద్దరూ సరదా సమయం గడిపారు. అందరూ ఓ హోటల్లో లంచ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశారు. అనంతరం మియామి వీధుల్లోని అభిమానులతో విరుష్క జంట సందడి చేసింది. ముఖ్యంగా కోహ్లీ చిన్న పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసాడు. అభిమానుల అందరితో ఇద్దరూ సెల్ఫీలు దిగారు. వారికి కోహ్లీ ఆటో గ్రాఫ్ కూడా ఇచ్చాడు.

సోషల్ మీడియాలో వైరల్‌:

సోషల్ మీడియాలో వైరల్‌:

ఫ్యాన్స్‌తో దిగిన ఫోటోలను అనుష్క శర్మ తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రపంచకప్‌ సెమీస్ మ్యాచ్‌కు ముందు కూడా మాంచెస్ట‌ర్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టారు. 2017 డిసెంబరు 11న ఇటలీలోని ఖరీదైన విల్లాలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నా.. భారీ రిసెప్షన్ పెట్టి అందరినీ ఆహ్వానించారు.

ఫ్లోరిడాలో రెండు టీ20లు:

కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం సుదీర్ఘ పర్యటన కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇరు జట్లు ఈ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నాయి. ముందుగా ఫ్లోరిడాలో రెండు టీ20లు ఆడిన అనంతరం టీమిండియా వెస్టిండీస్‌ వెళ్లనుంది. సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ స్వయంగా తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ను వికెట్‌ కీపర్‌గా భాద్యతలు నిర్వర్తించనున్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here