మిరాకిల్ బేబీ.. ఈ చిన్నారి పుట్టిన తేదీ, టైమ్ 7-11, బరువు కూడా 7.11

0
2


రోజుల్లో అంతా ముహూర్తం చూసుకుని పిల్లలను కంటున్నారు. సంఖ్యా బలం, అంకెలను నమ్మే ప్రజలు సిజీరియన్‌లకు మొగ్గు చూపుతున్నారు. హాస్పిటళ్లు కూడా అవసరం లేకుండానే ఆపరేషన్లు చేసి బిడ్డను ‘టైమ్’కు తీసేస్తున్నాయి. చేతి నిండా సంపాదిస్తున్నాయి. అయితే, అక్కడ అలా జరగలేదు.. ఏ ముహూర్తం లేకుండానే వారికి ‘టైమ్’ కలిసి వచ్చింది.

అమెరికాలోని సెయింట్ లూయిస్‌కు చెందిన రాచెల్ ల్యాంగ్‌ఫార్డ్ ఈ నెల 11న(ఏడో నెల 11వ తేదీ) పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవించిన సమయం కూడా 7.11 గంటలు. అంతేకాదు.. ఆ చిన్నారి బరువు కూడా 7.11 ఔన్సులు (35.27 ఔన్సులు = 1 కేజీ). ఈ సంఖ్యలు చూడగానే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.

అమెరికా ప్రజలు 7-11 సంఖ్యను లక్కీగా భావిస్తారు. ప్రముఖ మార్కెటింగ్ సంస్థ ‘7 ఎలివన్’ ఏటా 7-11 రోజున ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వినియోగదారులకు ఉచితంగా స్లర్‌పీ (గణీభవించిన కార్బొనేటెడ్ డ్రింక్) అందిస్తుంది. దీంతో ఆ సంఖ్యను అంతా క్రేజీగా భావిస్తున్నారు.

ఈ సంఖ్యలపై తనకు అవగాహన లేదని ల్యాంగ్‌ఫార్డ్ చెప్పడం గమనార్హం. దానికి అంతా ప్రాధాన్యం ఉందని మీడియాలో కథనాలు వచ్చిన తర్వాతే తెలిసిందని తెలిపింది. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందని పేర్కొంది. తాను గర్భంతో ఉన్నప్పుడు చాలాసార్లు గడియారంలో సమయం 7.11 గంటలు ఉండేదని తెలిపింది. ఆమె పుట్టిన తేదీ, సమయం, చివరికి బరువు కూడా అంతే సంఖ్య ఉంటుందని తాను ఎన్నడూ ఊహించలేదని, ఇది నిజంగా మిరాకిల్ అని సంతోషం వ్యక్తం చేసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here