మీకు ఒకటికి మించి బ్యాంకు ఖాతాలున్నాయా… అయితే కష్టమేమరి!

0
1


మీకు ఒకటికి మించి బ్యాంకు ఖాతాలున్నాయా… అయితే కష్టమేమరి!

ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా లేని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఉన్నతాదాయ వర్గాల నుంచి పేదవారి వరకు బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ది పొందే వారందరు ఇప్పుడు బ్యాంకు ఖాతాల ద్వారానే నగదు పొందుతున్నారు. అయితే ఉద్యోగాలు చేసేవారు, మధ్యాదాయ వర్గాలు ఒకటికి మించి బ్యాంకు ఖాతాలను కలిగి ఉండటం సహజంగా మారింది. విభిన్న సందర్భాల్లో ఈ ఖాతాలను వివిధ బ్యాంకుల్లో తీసివుంటారు. మెరుగైన బ్యాంకు సేవలు పొందడానికి, షేర్లలో లావాదేవీలు నిర్వహించడానికి, ఉద్యోగం మారిన సందర్భంలో ఖాతాలు తెరిచే వారు ఎక్కువగా ఉంటారు. అయితే ఇలా ఎక్కువ ఖాతాలు ఉండటం వల్ల వీటి నిర్వహణ కష్టంగానే మారిపోతోంది. అదెలాగంటే…

కనీస నిల్వ నుంచి…

* ఇంతకు ముందు బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ లేకపోయినా బ్యాంకులు అంతగా పట్టించుకునేవి కాదు. కానీ ఖాతాల సంఖ్య పెరిగే కొద్దీ వాటి నిర్వహణ కష్టంగా మారడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కనీస నిల్వ నిభంధనను బ్యాంకులు అమల్లోకి తెచ్చాయి. ఈ మేరకు ఖాతాలో నిల్వ లేకుంటే బ్యాంకులు చార్జీల మోత మోగిస్తాయి. కాబట్టి వాటిలో ఉంచడం తప్పనిసరి. మూడునాలుగు ఖాతాలున్న వాటిలో కనీసం పది వేల రూపాయలకు మించి నిల్వను ఉంచాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో కనీస నిల్వకు సంబంధించిన నిబంధనల్లో తేడా ఉంటుంది.

చార్జీలు

చార్జీలు

* బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో ఉండే సొమ్ముపై బ్యాంకులు కొంత వడ్డీ రేటును చెల్లిస్తుంటాయి. ఇదే సమయంలో అవి అందిస్తున్న వివిధరకాల సర్వీసులకు చార్జీలు వసూలు చేస్తాయి. ఖాతా ఉన్నవారందరూ ఏటీఎం కార్డును కూడా తీసుకుంటారు. ఈ కార్డులను తీసుకున్నందుకు బ్యాంకులు వార్షిక చార్జీలను వసూలు చేస్తుంటాయి. సగటున వంద రూపాయలు వసూలు చేసినా నాలుగు ఖాతాలున్నాయంటే నాలుగు వందలు చెల్లించాల్సి వస్తుంది. ఎస్సెమ్మెస్ చార్జీలను కూడా చెల్లించాల్సి ఉంటుంది.

పాస్ వర్డ్స్ కష్టాలు..

పాస్ వర్డ్స్ కష్టాలు..

* ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకులు కూడా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాలను కల్పిస్తున్నాయి. బ్యాంక్ ఖాతాలో ఉన్న నిల్వను తెలుసుకోవడానికి, సొమ్మును ఇతర ఖాతాలకు బదిలీ చేయడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వినియోగించుకుంటాము. దీనితో పాటు మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాలను కూడా వాడుకుంటున్నాయి.

* అయితే ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించడానికి తప్పనిసరిగా లాగ్ ఇన్ పాస్ వర్డ్ , ట్రాన్సాక్షన్ పాస్ వర్డ్ అవసరం. వీటికి కొంత కాలపరిమితి ఉంటుంది. ఆ కాలం తర్వాత పాస్ వర్డ్ లను మార్చుకోవాల్సి ఉంటుంది. తరచూ మార్చుతూ ఉండటం వల్ల వాటిని గుర్తుకు పెట్టుకోవడం అనేది ఇబ్బంది కరమైనదే. వీటిని గుర్తు పెట్టుకుంటూ తరచూ మార్చుకోవడం అనేది ఓ పెద్ద పనిలా మారిపోతుంది.

ఖాతాను నిర్వహించకపోతే..

ఖాతాను నిర్వహించకపోతే..

* ఉద్యోగం మారిన ప్రతిసారీ కొత్త బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో పాత ఖాతాను మూసివేసుకోవడం మేలు. లేకపోతే ఇందులో కనీస నిల్వ ఉంచాలి. మరచిపోయి ఖాతా నుంచి లావాదేవీలు నిర్వహించనట్టయితే కొంతకాలానికి బ్యాంకులు దాన్ని పనిచేయని ఖాతా జాబితాలో చేర్చుతారు. అప్పుడు ఆ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహించాలంటే మళ్లీ బ్యాంకుకు వెళ్లి తగిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

* ఖాతాలన్నింటికీ ఆధార్, పాన్ నెంబర్లను అనుసంధానించాల్సిందే.

* ఆదాయ పన్ను రిటర్న్ లు సమర్పించేవారు తమ బ్యాంకు ఖాతా వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. అప్పుడు తమ ఖాతాల్లో దేన్నీ ఎంచుకోవాలన్న దానిపై సందిగ్దత ఉంటుంది.

ఇలా చేయండి...

ఇలా చేయండి…

* మీకు, మీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా బ్యాంకు ఖాతాలను ఉంచుకోండి. అవసరం లేని వాటిని మూసివేయండి. మీరు అందుబాటులో లేని సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఖాతాను నిర్వహించుకునే విధంగా చూసుకోవాలి. ఇందుకోసం ఒక జాయింట్ అకౌంట్ తీసుకుంటే సరిపోతుంది.

* లేదా వారి పేరుమీద ప్రత్యేకంగా ఒక సేవింగ్స్ ఖాతా సరిపోతుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here