మీకు మాత్రమే చెప్తా అంటున్న Rowdy

0
2


అర్జున్‌రెడ్డి సినిమాతో విజయ్ దశ తిరిగింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు నిర్మాతగానూ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తొలి సినిమాకు మీకు మాత్రమే చెప్తా అనే ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయన్ని కూడా ఆయన ఆసక్తికరమైన వీడియె ద్వారా ప్రకటించారు.

‘సినిమా పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకోవడానికి చాలా మంది కష్టపడుతుంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన రోజే నిర్ణయించుకున్నాను నిర్మాణ సంస్థను ప్రారంభించాలని. అది ఎంత కష్టమో, ఎంత రిస్కో తెలిసొచ్చింది. నేను డబ్బులన్నీ సేవ్ చేసుకుని కింగ్ ఆఫ్ ది హిల్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించాను’ అని పేర్కొంటూ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

మరో విషయం ఏంటంటే.. తనకు ‘పెళ్లి చూపులు’ సినిమాలో అవకాశం ఇచ్చిన తరుణ్ భాస్కర్‌నే తన సినిమాలో లీడ్ రోల్‌గా పెట్టుకున్నారు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ప్రస్తుతం ‘హీరో’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆనంద్ అన్నమలై దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తున్నారు. దీంతో పాటు ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here