మీకు మీరే సాటి, శత్రువుల సలామ్, ఉక్కు మహిళ సుష్మాస్వరాజ్, గాలి బ్రదర్స్, బళ్లారి శ్రీరాములు

0
0


మీకు మీరే సాటి, శత్రువుల సలామ్, ఉక్కు మహిళ సుష్మాస్వరాజ్, గాలి బ్రదర్స్, బళ్లారి శ్రీరాములు

బెంగళూరు: కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు, ఉక్కు మహిళ సుష్మాస్వరాజ్ మరణవార్తను భారతదేశ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. తల్లి మీకు మీరు సాటి, సలామ్ ఉక్కు మహిళ అంటున్నారు. ముఖ్యంగా కర్ణాటకలోని బళ్లారి జిల్లా ప్రజలకు సుష్మాస్వరాజ్ తో ఎంతో అనుబంధం ఉంది. మాజీ మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి శ్రీరాములకు గాడ్ మదర్ సుష్మాస్వరాజ్. మా అమ్మ సుష్మాస్వరాజ్ లేని లోటు తీర్చలేనిది, ఆమెతో మాకు ఎంతో అనుబంధం ఉందని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బీజేపీ నేత బళ్లారి శ్రీరాములు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

బళ్లారి బ్రదర్స్

మరచిపోలేని సాధనలు, వ్యక్తిత్వం, మీ ధైర్య సాహసాలు వదిలివెళ్లిపోయారు. అమ్మ సుష్మాస్వరాజ్ మీకు కోటి నమస్కారాలు, మీ జ్ఞాపకాలు మేము జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం. మా సోదరులు (బళ్లారి బ్రదర్స్), బళ్లారి జిల్లా ప్రజల మీద మీరు చూపించిన ప్రేమ, అనురాగాలు మాకు జీవితాంతం గుర్తుంటాయి తల్లి అంటూ మాజీ మంత్రి, గాలి జనార్దన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

అమ్మ లేని అనాథలు

అమ్మ లేని అనాథలు

మీరు లేరనే వార్త తెలుసుకుని మాతో పాటు కోట్లాది మంది అమ్మ లేని అనాథలు అయ్యాం. సుష్మాజీ మీరు లేని లక్షల మంది బీజేపీ కార్యకర్తలు నేడు శోఖసంద్రంలో మునిగిపోయారు. తిరిగిరాని లోకాలకు మీరు వెళ్లిపోయినా మీ ఆశీర్వాదం మాకు ఉంటుటంది తల్లి అని శ్రీరాములు తన ఫేస్ బుక్ లో సంతాపం తెలిపారు.

మాతృ హృదయం

మాతృ హృదయం

కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అంటే గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరులు, బళ్లారి శ్రీరాములు ఎంతో గౌరం ఇస్తారు. గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యుల్లో సుష్మాస్వరాజ్ ఒక్కరు అనే అంత అన్యోన్యంగా ఉండేవారు. తల్లితో సమానంగా చూసుకన్న సుష్మాస్వరాజ్ లేనిలోటు మాకు ఎప్పటికి తీరదని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు అన్నారు.

మీకు మీరే సాటి తల్లి, సలామ్

మీకు మీరే సాటి తల్లి, సలామ్

భారత విదేశాంగ మంత్రిగా మీరు విదేశీయుల మన్నలు అందుకున్నారు శత్రు దేశం పాకిస్థాన్ కు చెందిన వారికి ఎంతో సహాయం చేశారు. మీరు మా దేశంలో ఎందుకు పుట్టలేదు అమ్మా అని స్వయంగా పాకిస్థాన్ ప్రజలు అన్నారు. అమ్మ మీరు చూసిన ప్రేమ, అప్యాయతకు భారతదేశంతో పాటు విదేశీయులు సలామ్ చేశారు. మీకు మీరే సాటి తల్లి అని బళ్లారి శ్రీరాములు చెప్పారు.

అమ్మా కోటి వందనాలు

అమ్మా కోటి వందనాలు

విదేశాంగ మంత్రిగా సామాన్య ప్రజలకు మీరు దగ్గరైనారు. మా చేతులు పట్టుకుని నడిపించి రాజకీయ భిక్ష పెట్టారు. తల్లి లాంటి మీరు శారీరకంగా మాకు దూరం అయ్యారు, కానీ మీరు చూపించిన ప్రేమ, అనురాగాలు మాకు జీవితాంతం గుర్తుంటాయి అని శ్రీరాములు విషాదంతో అన్నారు. మీరు స్వర్గం నుంచి ఎప్పుడూ ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం, మీకు కోటి వందనాలు, మీకు ఎవరూ సాటి రారు అమ్మా అంటూ సుష్మాస్వరాజ్ కు బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు సంతాపం వ్యక్తం చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here