మీరు ఏ ప్లాస్టిక్ వారుతున్నారో తెలుసా?

0
2


మీరు ఏ ప్లాస్టిక్ వారుతున్నారో తెలుసా?

ప్లాస్టిక్ మన జీవితంలో తెలియకుండానే ఒక భాగంగా మారిపోయింది. అనేక రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులను నేడు మనం వినియోగిస్తున్నాం. వీటిలో ఏ రకం ప్లాస్టిక్ ను మీరు వినియోగిస్తున్నారో మీకు తెలుసా. కొన్ని ప్లాస్టిక్ ఉత్పత్తులను మళ్లీమళ్లీ వినియోగించవచ్చు. కొన్నింటికి వినియోగించలేము. కొన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తులు పర్యావరణానికి చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం మొదలు పెడుతున్నాయి. అసలు ప్లాస్టిక్ లో ఎన్ని రకాలు ఉన్నాయి. వాటిలో ఏ ప్లాస్టిక్ ను మనం వినియోగిస్తున్నామో తెలుసుకోండి మరి.

పాలీ ఎథిలిన్

దీన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. విభిన్న రూపాల్లో దీని వినియోగిస్తున్నారు. హై డెన్సిటీ పాలీ ఎథిలిన్ (హెచ్ డీ పీ ఈ ), లో డెన్సిటీ పాలీ ఎథిలిన్ (ఎల్ డీ పీ ఈ ) ఉత్పత్తులు ఎక్కువ తయారు అవుతుంటాయి. ఈ ప్లాస్టిక్ ను క్యారీ బ్యాగులు, బాటిళ్లు, ఫిల్మ్స్, పైపులు, బొమ్మల్లో వినియోగిస్తున్నారు. ఎల్ డీ పీ ఈ ప్లాస్టిక్ తోనే మనం సరుకుల కోసం వినియోగించే బ్యాగులు, డ్రై క్లీనింగ్, బ్రెడ్, ఫ్రోజెన్ ఫుడ్ బ్యాగులు, చెత్త కవర్లను తయారు చేస్తుంటారు. ప్లాస్టిక్ రాప్స్, బెవరేజే కప్స్, చిన్న బాటిళ్లు, ఆహారాన్ని నిల్వ చేసే కంటైనర్లు , కంటైనర్ లిడ్స్ లో వినియోగిస్తుంటారు.

పాలీ ప్రోఫిలిన్

పాలీ ప్రోఫిలిన్

వేడినుంచి తట్టుకోవడానికి, డ్యామేజ్ కాకుండా నివారించడానికి ఈ ప్లాస్టిక్ ను వాడుతారు. ఆహార కంటైనెర్ , కార్పెట్లు, రగ్గులు, తాళ్లు, ఫర్నిచర్ , పైపుల్లో వినియోగిస్తారు. మెడికల్, లేబొరేటరీ లో వినియోగించే ఉత్పత్తుల తయారీలోనూ దీన్ని వాడుతారు.

పాలీ ఎథిలిన్ టెరెఫ్తలేట్

పాలీ ఎథిలిన్ టెరెఫ్తలేట్

దీన్నే పెట్ గా చెబుతారు. ఇది చాలా తక్కువ బరువును కలిగి ఉంటుంది. దీన్ని ఎక్కువగా డ్రింక్ బాటిళ్ల తయారీలో వినియోగిస్తుంటారు. అంతేకాకుండా క్లోతింగ్ ఫైబర్స్ అంటే పాలిస్టర్ తయారీలోనూ వినియోగిస్తారు. దీన్ని రెడీ తో ఈట్ ఆహార ప్యాకేజింగ్, టేపుల తయారీలో వినియోగిస్తారు.

పాలీవినీల్ క్లోరైడ్

పాలీవినీల్ క్లోరైడ్

దీన్నే పీవీసీ గ్గా వ్యవహరిస్తాం. ఇది చాలా బలంగానే కాకుండా చాలా సులభంగా వంగే విధంగా కూడా ఉంటుంది. ఇంటికి అవసరమైన కిటికీలు, డోర్ ఫ్రేములు, పైపులు, బ్యాంక్ కార్డుల తయారీలో వినియోగిస్తారు. ఎలక్ట్రిక్ కేబుల్ ఇన్సులేషన్ కు కూడా దీనిని వినియోగిస్తారు.

పాలిస్టరీన్

పాలిస్టరీన్

ఇది ఘన రూపంలో ఉంటుంది. దీన్ని ప్లాస్టిక్ కట్లెరీ, సీడీ కేసులు, డిస్పోజబుల్ రేజర్లు వంటి వాటిని తయారు చేయడానికి వాడుతుంటారు. ప్యాకేజింగ్ మెటీరియల్స్, బిల్డింగ్ ఇన్సులేషన్, కంటైనర్ల కోసం విరివిగా వాడుతుంటారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here