మీ క్రెడిట్ స్కోర్ ఎంత? బాగుంటేనే ఆఫర్లు.. లేదంటే బాదుడే!

0
1


మీ క్రెడిట్ స్కోర్ ఎంత? బాగుంటేనే ఆఫర్లు.. లేదంటే బాదుడే!

ఇప్పుడు రుణాల మంజూరులో బ్యాంకులు ఓ కొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ బాగా ఉన్న వారికి సలువుగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. అంతేకాదు, ఇలాంటి వారి నుంచి వడ్డీ కూడా తక్కువే వసూలు చేస్తున్నాయి. అదే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా, క్రెడిట్ హిస్టరీ బాగోకపోయినా.. అలాంటి వారికి రుణాల విషయంలో చుక్కలే! ఒకవేళ ఇచ్చినా వడ్డీ భారంతో నడ్డి విరుగుతుంది.

చాలా బ్యాంకులు రుణాల మంజూరులో వడ్డీ రేట్లను ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్‌తో లింక్ చేయడం మాత్రమేకాదు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (సిబిల్) సంస్థ నుంచి కూడా వ్యక్తులు, సంస్థలక్రెడిట్ స్కోర్‌ను తీసుకుని బేరీజు వేస్తు్నాయి. అందుకే ఆర్థిక లావాదేవీల విషయంలో క్రమశిక్షణ అనేది అవసరం. గతంలో తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తూ ఉంటే మీ సిబిల్ స్కోర్ మరింత మెరుగవుతుంది.

కొత్తగా క్రెడిట్ రిస్క్ ప్రీమియం…

చాలా బ్యాంకులు ఇప్పుడు తాము ఇచ్చే రుణాలపై కొత్తగా క్రెడిట్ రిస్క్ ప్రీమియం వసూలు చేస్తున్నాయి. రుణ ఎగవేతలు అధికమవుతున్న నేటి తరుణంలో బ్యాంకులు ఇలా అధిక మొత్తం వడ్డీలు వసూలు చేయడంపై రిజర్వ్ బ్యాంకు కూడా అడ్డు చెప్పడం లేదు. దీనిని బట్టి రుణ మంజూరు విషయంలో వడ్డీ రేటు నిర్ణయంపై వ్యక్తులు, సంస్థల క్రెడిట్ స్కోర్ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు నిర్ణయించడానికి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌ను అనుసరిస్తున్నాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇలా...

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇలా…

సిబిల్ స్కోర్ 900పైగా ఉన్న వారికి 1 శాతం తక్కువ వడ్డీకే ఈ బ్యాంకు రుణాలు అందిస్తోంది. అలాగే సిబిల్ స్కోర్ 760-900 మధ్యన ఉన్న వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా 8.1 శాతం వడ్డీకి రుణాలు అందిస్తోంది. అదే క్రెడిట్ స్కోర్ 725-759 మధ్యన ఉంటే రుణంపై వడ్డీ కాస్తా 8.35 శాతానికి పెరుగుతుంది. ఇక క్రెడిట్ స్కోర్ 675-724 మధ్యన ఉంటే.. ఇదే వడ్డీ 9.1 శాతానికి పెరుగుతుంది.

సిండికేట్ బ్యాంకులో ఇలా...

సిండికేట్ బ్యాంకులో ఇలా…

సిండికేట్ బ్యాంకు కూడా ఈ విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బాటలోనే పయనిస్తోంది. రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ 50 పాయింట్లకుపైన పడిపోయినప్పుడు ఈ బ్యాంకు అధిక రిస్క్ ప్రీమియంను వసూలు చేస్తోంది. ఈఎంఐ గడువు దాటిన తరువాత 30 రోజులకు పైన కూడా డబ్బు చెల్లించకపోతే ఆ ప్రభావం రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్‌పై పడుతుంది. ఇలా ఒక ఏడాదిలో మూడుసార్లు గనుక జరిగితే రుణ గ్రహీత క్రెడిట్ రిస్క్ ప్రీమియం అధికంగా చెల్లించాల్సి వస్తుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో...

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో…

క్రెడిట్ స్కోర్ 700కు తక్కువగా ఉండే వ్యక్తులకు రుణ మంజూరులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 10 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీని వసూలు చేస్తోంది. సాధారణంగా వ్యక్తులు, సంస్థల క్రెడిట్ స్కోర్ 900 ఉంటే.. అంది చాలా మంచి స్కోర్. రుణాల మంజూరులో ఇలాంటి వ్యక్తులు, సంస్థలకు బ్యాంకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందే క్రెడిట్ స్కోర్ 300 ఉంటే.. అది చాలా బ్యాడ్ స్కోర్. ఇలాంటి స్కోర్ ఉన్న వ్యక్తులు, సంస్థలకు అసలు ఏ బ్యాంకూ రుణం మంజూరు చేయదు.

వడ్డీ రేటులో మార్పులు...

వడ్డీ రేటులో మార్పులు…

బ్యాంకు నుంచి మీరు తీసుకున్న రుణంపై వడ్డీ రేటు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండదు. మీ క్రెడిట్ స్కోరును బట్టి వడ్డీ రేటు కూడా మారుతూ ఉంటుంది. రుణం తీసుకున్న ఏడాది తరువాత మీ క్రెడిట్ స్కోరు మెరుగుపడితే.. అప్పుడు ఈ రిస్క్ ప్రీమియం కూడా తగ్గుతుంది. ఆ ప్రాతిపదికన మీ రుణంపై వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. కాబట్టి రుణ చెల్లింపులో ఇబ్బందులు, జాప్యం లేకుండా చూసుకుంటూ మీ క్రెడిట్ స్కోరును పెంచుకోవచ్చు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here