మీ భార్య బంగారం కొనమంటోందా.. ఐతే ఆలస్యం చేయకండి!!

0
2


మీ భార్య బంగారం కొనమంటోందా.. ఐతే ఆలస్యం చేయకండి!!

అమెరికా – చైనా ట్రేడ్ వార్ అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర శుక్రవారం పెరిగింది. ఆసియాలో ఔన్స్ బంగారం ధర 7 డాలర్లు పెరిగి 1,538కి చేరుకుంది. ట్రేడ్ వార్ కారణంగా అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఉంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బాండ్లు, పసిడి ఫ్యూచర్లలో పెట్టుబడులు పెడుతున్నారు.

రికార్డుకు చేరవలో బంగారం ధర

మన దేశం విషయానికి వస్తే బంగారం ధరలు గరిష్టస్థాయి వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం MCXలో 10 గ్రాముల పసిడి ధర రూ.38,143 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత మధ్యాహ్నానికి రూ.38,212కు చేరుకుంది. ఇటీవలి ఆల్ టైమ్ హై రికార్డ్ రూ.38,666కు సమీపంలో ఉంది. బుధవారం పసిడి ధర దాదాపు నాలుగు వందల రూపాయలు పెరిగి రూ.38,163 వద్ద క్లోజ్ అయింది. వెండి ధర కూడా రూ.44,100 వద్ద ఉంది. ఈ వారం వెడి కిలో రికార్డ్ స్థాయిలో రూ.45,000కు చేరుకుంది.

దాదాపు సగం తగ్గిన దిగుమతి

దాదాపు సగం తగ్గిన దిగుమతి

బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే భారత్‌లో ధరల పెరుగుదల ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల బంగారం భారీగా పెరిగింది. ఓ తాజా డేటా ప్రకారం జూలై నెలలో బంగారం దిగుమతులు 42 శాతం తగ్గి 1.71 బిలియన్ డాలర్ల మేరకు పడిపోయింది. ప్రస్తుతం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కన్స్యూమర్లు తమ పాత బంగారాన్ని విక్రయిస్తున్నారట.

రూపాయి కూడా కారణం

రూపాయి కూడా కారణం

అమెరికా – చైనా వాణిజ్య యుద్ధంతో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా బంగారంపై ప్రభావం పడింది. డాలర్‌తో రూపాయి విలువ 71.35కు పడిపోయింది. బంగారం ధర పెరగడానికి ఇది కూడా కారణం. ఇదిలా ఉండగా, రోజు రోజుకు బంగారం ధర భారీగా పెరుగుతుండటంపై సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

మీ భార్య బంగారం అడిగితే నో చెప్పకండి..

మీ భార్య బంగారం అడిగితే నో చెప్పకండి..

బంగారం పెరుగుదలపై ఎన్నో ఆసక్తికర కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా వైరల్ అవుతున్న వాటిల్లో ఎంతో ఆసక్తి కలిగించే విధంగా ఉన్న ఓ పోస్ట్ చూడండి….

‘1990……1 కిలో బంగారం = మారుతీ 800 కారు

2000……1 కిలో బంగారం = ఎస్టీమ్ కారు

2005……1 కిలో బంగారం = ఇన్నోవా కారు

2010……1 కిలో బంగారం = ఫార్యునర్ కారు

2019…..1 కిలో బంగారం = BMW X1

ఒక కిలో బంగారాన్ని కొని పెట్టుకొని, 2030 వరకు వేచి చూస్తే దాంతో మీరు ఓ ప్రయివేటు జెట్ కొనుగోలు చేయవచ్చునేమో..

సొ… మీ భార్య బంగారం కావాలని అడిగితే నో చెప్పకండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here