మీ లోన్ ముందే చెల్లించాలనుకుంటున్నారా.. గుడ్‌న్యూస్!

0
0

మీ లోన్ ముందే చెల్లించాలనుకుంటున్నారా.. గుడ్‌న్యూస్!

మీరు హోమ్ లోన్ లేదా వెహికిల్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకున్నారా? గడువుకు ముందే రుణాలు చెల్లిస్తే జరిమానా పడుతుందని ఆందోళన చెందుతున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. ప్రీపేమెంట్ లేదా ఫోర్ క్లోజర్ ఛార్జీలు వసూలు చేయవద్దని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను (NBFC) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది.

వచ్చే జీతం లేదా వ్యాపారం లేదా ఇతర వ్యాపకాల ద్వారా సంపాదించే డబ్బులు అవసరాలకు సరిపోని పరిస్థితుల్లో చాలామంది వివిధ రకాల లోన్‌లు తీసుకుంటారు. ఈ లోన్ మొత్తాన్ని.. ప్రతి నెల కొంత మొత్తం పరిమిత సమయంలో చెల్లిస్తారు. అయితే డబ్బులు సమకూరితే ముందే రుణం మొత్తం తీర్చేందుకు ఆసక్తి కనబరుస్తారు. కానీ NBFC వీటిపై ఛార్జీలు వసూలు చేస్తాయి.

పెనాల్టీ వద్దని ఆదేశం

పెనాల్టీ వద్దని ఆదేశం

అయితే వ్యక్తులు తీసుకున్న రుణాన్ని నిర్దేశిత సమయం కంటే ముందే చెల్లిస్తే వారి నుంచి ఎలాంటి పెనాల్టీ వసూలు చేయవద్దని NBFCలను ఆర్బీఐ ఆదేశించింది. వ్యాపార అవసరాలకు మినహాయించి, ఇతర వ్యక్తిగత అవసరాలకు తీసుకున్న ఫ్లోటింగ్ వడ్డీ రేటు అమలయ్యే టెన్యూర్ లోన్స్ కనుక ముందస్తుగా తీర్చినా జరిమానాలు విధించడాన్ని ఆర్బీఐ నిషేధించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త రూల్ ఎప్పి నుంచి అమల్లోకి వస్తుందో మాత్రం వెల్లడించలేదు.

వాటికి మాత్రం మినహాయింపు

వాటికి మాత్రం మినహాయింపు

NBFCలు ఫోర్ క్లోజర్, ప్రిపేమెంట్ పెనాల్టీలు వసూలు చేయవద్దని, ఫ్లోటింగ్ రేట్ టర్మ్ రుణాలకు ఇది వర్తిస్తుందని, బిజినెస్ రుణాలు ఇందుకు మినహాయింపు అని ఆర్బీఐ నోటిఫికేషన్లో పేర్కొంది. ముందస్తు చెల్లింపు ఛార్జీలను NBFCలు రుసుము ఆదాయంగా చూపుతాయి. ఇవి ఆయా సంస్థల లాభాల్లో జమ అవుతాయి. అయితే వ్యక్తిగత రుణాల వంటి హామీలేని రుణాల్లో మాత్రం ఛార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here