ముఖేష్ అంబానీ ఆస్తి రూ.3,80,700 కోట్లు, టాప్ 10 వీరే

0
3


ముఖేష్ అంబానీ ఆస్తి రూ.3,80,700 కోట్లు, టాప్ 10 వీరే

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత్‌లోనే అత్యంత సంపన్నుడిగా వరుసగా ఎనిమిదోసారి నిలిచారు. ఆయన ఆస్తులు ఆక్షరాలు రూ.3,80,700 కోట్లు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ భారత కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఇందులో మరోసారి ముఖేష్ అగ్రస్థానంలో నిలిచారు.

రూ.1,86,500 కోట్ల సంపదతో హిందూజా కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. రూ.1,17,100 కోట్లతో విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్ జీ మూడో స్థానంలో, రూ.1,07,300 కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ ఎల్ ఎన్ మిట్టల్ నాలుగో స్థానంలో, రూ.94,500 కోట్లతో గౌతమ్్ అదానీ ఐదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వరుసగా ఉదయ్ కొటక్, సౌరస్ ఎస్ పూనావాలా, పల్లోంజీ మిస్త్రీ, షాపూర్ పల్లోంజీ, దిలీప్ సంఘ్వీ వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానంలో నిలిచారు.

భారత్‌లో సంపన్నుల సంఖ్య పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. 2018లో రూ.1000 కోట్ల కంటే ఎక్కువ సంపాదన కలిగిన వారు 831 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 953కు చేరుకుంది. టాప్ 25 స్థానాల్లో ఉన్న శ్రీమంతుల సంపద మొత్తం దేశ జీడీపీలో పది శాతానికి సమానమని తెలిపింది.

– ముఖేష్ అంబానీ (Reliance Industries Ltd.): Rs 3,80,700 crore

– హిందూజాలు (Ashok Leyland Ltd.): Rs 1,86,500 crore

– అజీమ్ ప్రేమ్ జీ (Wipro Ltd.): Rs 1,17,100 crore

– లక్ష్మీ నివాస్ మిట్టల్ (ArcelorMittal SA): Rs 1,07,300 crore

– గౌతమ్ అదానీ (Adani Enterprises Ltd.): Rs 94,500 crore

– సైరస్ ఎస్ పూనావాలా (Serum Institute of India): Rs 88,800 crore

– సైరస్ పల్లోంజీ మిస్త్రీ (Shapoorji Pallonji Group): Rs 76,800 crore

– షాపూర్ పల్లోంజీ ((Shapoorji Pallonji Group): Rs 76,800 crore

– దిలీప్ సంఘ్వీ (Sun Pharmaceutical Industries Ltd.): Rs 71,500 croreSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here