ముఖేష్ అంబానీ, ప్రేమ్ జీ ఆస్తులు ఒక్కరోజులోనే వేలకోట్లు క్రాష్

0
0


ముఖేష్ అంబానీ, ప్రేమ్ జీ ఆస్తులు ఒక్కరోజులోనే వేలకోట్లు క్రాష్

ముంబై: కాశ్మీర్ ఇష్యూ, అమెరికా – చైనా వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లు తదితర కారణాల వల్ల సోమవారం భారత మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. భారత్‌లోని టాప్ 5 బిలియనీర్ల సంపద ఈ ఒక్కరోజు (ఆగస్ట్ 5) రూ.4.08 బిలియన్ డాలర్ల మేర హరించుకుపోయింది.

ముఖేష్ అంబానీ రూ.17,150 కోట్లు నష్టపోయారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3.5 శాతం పడిపోయాయి. రూ.1,143 స్థాయికి క్షీణించాయి. దీంతో ముఖేష్ సంపాదన 44.8 బిలియన్ డాలర్లకు తగ్గింది. పల్లోంజీ మిస్త్రీ సంపద 281 మిలియన్ డాలర్లకు తగ్గింది. టాటా సన్స్‌లో ఈయనకు 18.4 శాతం వాటా ఉంది.

అజీమ్ ప్రేమ్ జీ 428 మిలియన్ డాలర్లు నష్టపోయారు. విప్రో షేర్లు ఒక శాతానికి పైగా పడిపోయాయి. హెచ్‌సీఎల్ చైర్మన్ శివనాడర్ సంపద 265 మిలియన్ డాలర్లకు, కొటక్ మహీంద్రా బ్యాంకు చైర్మన్ ఉదయ్ కొటక్ సంపద 662 మిలియన్ డాలర్లు హరించుకుపోయాయి.

ప్రపంచంలోని టాప్ 500 ధనవంతులకు చెందిన ఆస్తులు సోమవారం నాడు అమెరికా స్టాక్స్‌లో 2.1 శాతం మేర నష్టపోయాయి. అమెరికా – చైనా ట్రేడ్ వార్ వంటి పలు కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. సోమవారం యూఎస్ స్టాక్స్‌లో రెండు శాతానికి పైగా ధనవంతుల ఆస్తులు కరిగిపోయాయి. బ్లూమ్‌బర్గ్ నివేదికలోని 21 మంది బిలియనీర్లకు చెందిన 1 బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ నష్టపోయారు. బెజోస్ సంపద 3.4 బిలియన్ డాలర్లు పడిపోయింది. భారీ నష్టాలు చవిచూసినప్పటికీ జెఫ్ బెజోస్ టాప్ 1గా ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here