ముగిసిన ఏఐకేఎస్‌ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు

0
2


ముగిసిన ఏఐకేఎస్‌ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు

ఇందూరు గ్రామీణం: నిజామాబాద్‌ నగర శివారు మాదానగర్‌లోని ఓ కల్యాణ మండపంలో మూడు రోజులపాటు నిర్వహించిన ఏఐకేఎస్‌ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు బుధవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పసువు బోర్డు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. బోధన్‌ చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని తెరాస ప్రభుత్వం అప్పులపాలు చేసిందని విమర్శించారు. ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించి వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. వర్షాలు లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సాగునీరు త్వరితగతిన అందించాలన్నారు. 

https://betagallery.eenadu.net/htmlfiles/124332.html

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here