ముగిసిన రాష్ట్రస్థాయి త్రోబాల్‌ లీగ్‌ దశ క్రీడలు

0
1


ముగిసిన రాష్ట్రస్థాయి త్రోబాల్‌ లీగ్‌ దశ క్రీడలు

విజేతలుగా నిజామాబాద్‌, వరంగల్‌ జట్లు


బాలుర విభాగంలో కప్‌ గెలుచుకున్న నిజామాబాద్‌ జట్టు సభ్యులు

జన్నారం, న్యూస్‌టుడే : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో రెండు రోజులుగా కొనసాగుతున్న త్రోబాల్‌ లీగ్‌ దశ పూర్తి చేసుకున్నాయి. నల్గొండ-కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి, హైదరాబాద్‌-నిజామాబాద్‌ బాలికల జట్లు, ఆదిలాబాద్‌-వరంగల్‌ బాలుర జట్లు పాల్గొన్నాయి. మూడు రోజుల పాటు కొనసాగాల్సిన త్రోబాల్‌ పోటీలను రెండు రోజులకే పరిమితం చేశారు. వాతావారణం అనుకూలించక పోవడం వల్ల ఆదివారం జరగాల్సిన ఫైనల్‌ మ్యాచ్‌ శనివారమే నిర్వహించారు.

ఫైనల్‌లో తలపడుతున్న నిజామాబాద్‌-వరంగల్‌ జట్లు

త్రోబాల్‌ బాలుర విభాగంలో నిజామాబాద్‌ జట్టు కప్‌ గెలుచుకోగా, రన్నర్‌గా కరీంనగర్‌, మూడో స్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. బాలికల విభాగంలో వరంగల్‌ జిల్లా జట్టు ట్రోఫీ అందుకోగా, రన్నర్‌గా నిజామాబాద్‌, మూడో స్థానంతో మహబూబ్‌నగర్‌ జట్టు సరిపెట్టుకుంది. నిజామాబాద్‌-వరంగల్‌ జిల్లాల బాలికల విభాగంలో జరిగిన ఫైనల్‌ పోరు హోరాహోరీగా సాగింది. బెస్టాఫ్‌ త్రీలో మొదటి ఆట వరంగల్‌ జట్టు గెలుచుకోగా రెండోది నిజామాబాద్‌ జట్టు గెలుచుకుంది. మూడో ఆటలో గెలుపు దిశగా పయనించిన నిజామాబాద్‌ ఒక్క పాయింట్‌ సాధించాల్సిన దశలో సర్వీస్‌ ఫెయిల్‌ కావడంతో వరంగల్‌ కోర్టులోకి వెళ్లిన బంతిని ఆ జట్టు పూర్తిగా సద్వినియోగం చేసుకొని విజయకేతనం ఎగురవేసింది. బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర శ్యాంనాయక్‌ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి రోజీ వరకుమారి, ఎంపీపీ మాదాడి సరోజిని, జడ్పీటీసీ సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్‌, సర్పంచి జక్కు భూమేశ్‌, కట్ట రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here