ముద్దులతో ఇండో-పాక్ అమ్మాయిలు రొమాన్స్.. సరిహద్దులు దాటిన ‘స్వలింగ’ ప్రేమ!

0
0


ప్రేమకు ‘సరిహద్దులు’, లింగ బేధాలు లేవు. ఎవరైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చు. అబ్బాయిలు, అమ్మాయిలే పరస్పరం ప్రేమలో పడాలనే రూలు కూడా లేదు. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ.. ఓ ‘స్వలింగ’ ప్రేమికులు ఇలా ఘాటు ముద్దులు, హగ్గులతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. ఈ రోజుల్లో స్వలింగ సంపర్కులు ప్రేమించుకోవడం సాధారణమే కదా.. దీనికెందుకు అంత స్పందన అనుకుంటున్నారా? ఎందుకంటే వారు ఇండియాపాకిస్థాన్ దేశాలకు చెందినవారు కాబట్టి.

Read also: బంగాళ దుంపలపై మూత్రం పోసిన మహిళ.. సూపర్ మార్కెట్లో పాడుపని!

ఇండియాకు చెందిన హిందూ యువతి అంజలీ చక్రా, పాకిస్థాన్‌కు చెందిన ముస్లిం యువతి సుందాస్ మాలిక్‌లు ప్రేమలో పడ్డారు. న్యూయార్క్‌లో నివసిస్తున్న వీరి ‘స్వలింగ’ ప్రేమ సరోవర్ అనే ఫొటోగ్రాఫర్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో వారిపై ఇటీవల ఫొటోషూట్ నిర్వహించాడు. ‘ఎ న్యూయార్క్ లవ్ స్టోరీ’ పేరుతో ఆ ఫొటోలను అలా ట్విట్టర్‌లో పెట్టాడో లేదో.. అవి క్షణాల్లో వైరల్ అయిపోయాయి. వారి ప్రేమకు ఫిదా అయిన నెటిజనులు.. ‘ప్రేమకు సరిహద్దులే కాదు.. లింగ బేధాలతోనూ పనిలేదు’ అంటూ ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు.

Read also: అవి కోసి, శవాన్ని సూట్‌కేసులో కుక్కి.. మిస్టరీగా మారిన ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌ హత్య!

వారిద్దరూ తమ దేశ సాంప్రదాయ వస్త్రాలతో.. వర్షంలో గొడుగు పట్టుకుని నిలుచుని, కల్మషం లేని నవ్వులతో ఫొటోలకు పోజిచ్చారు. పారదర్శక (ట్రాన్సపరెంట్) గొడుగును అడ్డుపెట్టుకుని ముద్దులు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను 8 వేల మందికి పైగా రీట్వీట్ చేయగా.. 47వేల మంది లైక్ చేశారు. మరిన్ని చిత్రాల కోసం ఈ కింది ట్వీట్‌ను చూడండి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here