మున్సిపల్ అధికారుల దూకుడు.. భారీ భవంతులు నేలమట్టం..! (వీడియో)

0
11


మున్సిపల్ అధికారుల దూకుడు.. భారీ భవంతులు నేలమట్టం..! (వీడియో)

ఇండోర్ : మధ్యప్రదేశ్‌ మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తున్నారు. అనుమతులు లేని భవనాలపై కన్నెర్రజేస్తున్నారు. ఆ క్రమంలో కాస్ట్లీ బిల్డింగులు కూలగొడుతుండటం చర్చానీయాంశమైంది. అక్రమ భవనాలు ఎవరివైనా సరే ముందు వెనుకా చూడకుండా కూల్చివేస్తున్నారు. ఆ క్రమంలో మంగళవారం ఉదయం ఇండోర్ కామధేను నగర్‌లోని ఓ భారీ భవంతిని నేలమట్టం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ క్రమంలో ఈనెల 4వ తేదీన ఉజ్జయిని మున్సిపల్ అధికారులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడమే గాకుండా, ఆ స్థలంలో పెద్ద హోటల్ కట్టిన యజమానులకు షాక్ ఇచ్చారు. ఆ భవనం నిర్మించడానికి వారికి ఎన్నేళ్లు పట్టిందో తెలియదు గానీ.. మున్సిపల్ అధికారులు మాత్రం కేవలం 25 సెకన్లలో దాన్ని నేలమట్టం చేశారు. ఆ వీడియో కూడా వైరలయింది.

ఉజ్జయినిలో చాలా ఫేమస్ అయిన శాంతి ప్యాలెస్ హోటల్‌ను జులై 4వ తేదీన మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్రమంగా హోటల్ నిర్మించారనే కారణంగా భారీ భవనాన్ని సెకన్ల వ్యవధిలో కూల్చిపడేశారు. న్యాయస్థానం తీర్పుతో పురపాలక అధికారులు ఆ హోటల్‌ను నేలమట్టం చేశారు.

20 కోట్ల రూపాయలతో దాదాపు 100 గదులతో నిర్మితమైన అత్యాధునిక సౌకర్యాల శిఖరాగ్రం శాంతి ప్యాలెస్ హోటల్ కూల్చడం చర్చానీయాంశమైంది. రెసిడెన్షియల్ కాలనీ నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న హోటల్ యజమానులు భారీ భవంతిని కట్టారు. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టులో దాదాపు పదేళ్లుగా కేసు నడిచింది. ఆ క్రమంలో శాంతి ప్యాలెస్ హోటల్‌ను అక్రమ కట్టడంగా పేర్కొంటూ కూల్చివేయాలని ఆదేశించింది న్యాయస్థానం. భారీ భవంతులను ఇలా కూలగొట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here