ముప్పై రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

0
3



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు మణిహారంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి విజయ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పనులను చూసి సర్పంచ్‌ వికార్‌ పాషా, పంచాయతీ కార్యదర్శి రఘురామ్‌లను అభినందించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి రోడ్డు వెడల్పు పనులు, మురుగు కాలువలను శుభ్రం చేస్తున్న పనులను పరిశీలించారు. గ్రామాలు ఆదర్శంగా ఉండాలంటే ముఖ్యంగా పరిశుభ్రతను పాటించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గోపాలకష్ణ, పంచాయతీ అధికారి గౌస్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ప్రత్యేకాధికారి సాయికుమార్‌, ఎంపీటీసీ హైమద్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు కుర్మె సాయిలు, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here