మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనా: జీడీపీ ర్యాంకింగ్స్‌లో పడిపోయిన భారత్ స్థానం

0
6


మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనా: జీడీపీ ర్యాంకింగ్స్‌లో పడిపోయిన భారత్ స్థానం

జాతీయ స్థూల ఉత్పత్తి ర్యాకింగ్స్‌లో భారత ఆర్థిక వ్యవస్థ ఏడో స్థానానికి పడిపోయింది. ఈ నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఇక భారత్‌ను యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ దేశాలు అధిగమించి ముందుకెళ్లాయి. 2018లో భారత స్థూల దేశీయ ఉత్పత్తి జీడీపీ 2.72 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్నింది అదే యూకేది 2.82 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 2.77 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఇక ప్రపంచంలో మొదటి నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా అమెరికా (20.5 ట్రిలియన్ డాలర్లు), చైనా (13.6 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (4.9 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (3.9 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి.

2017 ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

2017లో భారత్ ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఆ సమయంలో ఫ్రాన్స్‌ను దాటుకుని భారత్ ముందు స్థానం ఆక్రమించింది. తాజాగా ఆయా దేశాల జీడీపీలను విడుదల చేసిన వరల్డ్ బ్యాంక్… యూకేని కూడా భారత్ అధిగమించిందని అయితే అది స్వల్పకాలం వరకు మాత్రమే ఉన్నిందని స్పష్టం చేసింది. 2017లో భారత జీడీపీ 2.65 ట్రిలియన్ డాలర్లు ఉండగా యూకే 2.64 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 2.59 ట్రిలియన్ డాలర్లుగా నిలిచాయి. ఇక 2018 తర్వాత యూకే, ఫ్రాన్స్‌ల ఆర్థిక వ్యవస్థలు అనూహ్యంగా పెరిగిపోయినట్లు ప్రపంచ బ్యాంకే డేటా చెబుతోంది.

 భారత కరెన్సీలో ఒడిదుడుకులు, వృద్దిరేటు మందగించడం కారణం

భారత కరెన్సీలో ఒడిదుడుకులు, వృద్దిరేటు మందగించడం కారణం

ఇదిలా ఉంటే జీడీపీలో భారత్ తన స్థానం కోల్పోయి ఏడో స్థానానికి పడిపోవడానికి కారణాలు చెబుతున్నారు ఆర్థికవేత్తలు. భారత్‌లో కరెన్సీలో ఒడిదుడుకులు, వృద్ధిరేటు మందగించడంలాంటి కారణాలతో భారత్ జీడీపీ ర్యాంకింగ్స్‌లో వెనకబడిందని చెబుతున్నారు. 2017లో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పెరుగగా అదే 2018లో అదే డాలరుతో రూపాయి విలువ పడిపోయిందని ఇండియా రేటింగ్స్‌లో చీఫ్ ఎకానమిస్ట్ దేవేంద్ర పంత్ చెబుతున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని చేరేందుకు భారత్ లక్ష్యాన్ని విధించుకుంది. 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్న క్రమంలో ప్రపంచబ్యాంకు విడుదల చేసిన లెక్కలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

 భారత్ కల నెరవేరుతుందా..?

భారత్ కల నెరవేరుతుందా..?

భారత్ అతివేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ప్రపంచదేశాల సరసన నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో వ్యాఖ్యానించారు. 2030 నాటికల్లా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే మాజీ ఆర్థిక సలహాదారులు అరవింద్ సుబ్రహ్మణ్యం మాత్రం 2011-12 మధ్య 2.5శాతం ఎక్కువగా అంచనా వేసింది ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నిందని తను పబ్లిష్ చేసిన పేపర్‌లో తెలిపారు. ఇక 2016-17లో అంటే ఎన్డీయే ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా ఇదే అంచనా వేసిందని చెప్పారు. అయితే ప్రధాని ఆర్థిక సలహా మండలి అరవింద్ సుబ్రహ్యణ్యం వాదనతో విబేధించాయి.

ఇక ఈ ఏడాది అతివేగవంతంగా ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థల్లో చైనాతో పోటీ పడి భారత్ వెనుకంజలో నిలిచింది. 2018-19 త్రైమాసికంలో జీడీపీ రేట్ 5.8శాతానికి పడిపోయిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గత 17 త్రైమాసికాల్లో తొలిసారిగా ఇంత తక్కువ స్థాయిలో జీడీపీ ఉండటం విశేషం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here