మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్, నెట్ ఫ్లిక్స్ సూపర్ ఆఫర్

0
1


మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్, నెట్ ఫ్లిక్స్ సూపర్ ఆఫర్

న్యూఢిల్లీ: నెట్ ఫ్లిక్స్ భారత యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఈ మేరకు అది యూజర్లకు శుభవార్త చెప్పింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ సేవలు చాలా చౌక అవుతున్నాయి. స్ట్రీమింగ్ దిగ్గజం బుధవారం (జూలై 24) దేశంలో తక్కువ ధర గల మొబైల్ టైర్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర నెలకు రూ.199 ($ 2.8).

పోటీ సంస్థలకు షాకిచ్చేలా నెట్ ఫ్లిక్స్ ప్లాన్

అమెజాన్ ప్రైమ్ వీడియోకు షాకిచ్చేలా అతి తక్కువ ధరకు నెలవారీ ప్లాన్‌ను ఈ రోజు ప్రకటించింది. మొబైల్ లేదా ట్యాబ్ సేవలకు మాత్రమే ఈ ప్లాన్ పరిమితమవుతుంది. టీవీకి కనెక్ట్ చేసుకోవడం వంటి ఫీచర్స్ లేవు. నెలకు రూ.500 బేసిక్ ప్లాన్‌తో కస్టమర్లను ఆకట్టుకోలేకపోయింది. అమెజాన్, హాట్‌స్టార్‌లు అంతకంటే తక్కువగా సేవలు అందిస్తున్నాయి. దీంతో వాటికి పోటీగా ఇప్పుడు ఈ కొత్త ప్లాన్ తెచ్చింది.

ఆఫర్ ప్రస్తుతానికి ఇక్కడే

ఆఫర్ ప్రస్తుతానికి ఇక్కడే

నెట్‌ఫ్లిక్స్ గత ఏడాది చివరలో ఇండియా, కొన్ని ఇతర ఆసియా మార్కెట్లలో తక్కువ ధరల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను పరీక్షించడం ప్రారంభించింది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో కంపెనీ అధికారులు ఈ రోజు మాట్లాడుతూ… ఈ ఆఫర్‌ను ప్రస్తుతానికి ఇతర ప్రాంతాలకు (దేశాలకు) విస్తరించే ఆలోచన లేదని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్ వీక్లీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా పరీక్షిస్తోంది. అది కూడా ఇకపై కొనసాగదని స్పష్టం చేశారు.

సరికొత్త ఆఫర్‌తో ఎక్కువమంది..

సరికొత్త ఆఫర్‌తో ఎక్కువమంది..

ఈ ఏడాది జూన్ నెలలో ముగిసిన క్వార్టర్ 1కు 2.7 మిలియన్ల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో అంచనా వేసిన 5.1 మిలియన్ల సంఖ్య కంటే ఇది చాలా తక్కువ. ఇప్పుడు రూ.199 ఆఫర్‌తో ఎక్కువమంది సబ్‌స్క్రైబ్ అవుతారని భావిస్తున్నారు.

వివిధ ఆఫర్లు

వివిధ ఆఫర్లు

తాజా ప్లాన్‌లో ఓసారి ఒక స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో SD కంటెంట్‌ను వీక్షిచేందుకు ఈ ప్లాన్ వినియోగదారులను అనుమతిస్తుంది. రూ.499, రూ.649, రూ.799 మధ్య ఉన్న ప్రస్తుత, బేసిక్, ప్రీమియం ప్రణాళికలతో పాటు నెట్‌ఫ్లిక్స్ తీసుకు వచ్చిన నాలుగో ప్లాన్ ఇది. ఫిక్కి నివేదిక ప్రకారం భారతీయ వినియోగదారులు ప్రయాణంలోనే చూస్తున్నారనీ, 30% ఫోన్ సమయంలో 70% మొబైల్ డేటాను ఎంటర్‌టైన్‌మెంట్‌లో గడుపుతున్నారని, దీంతో సాధ్యమైనంత ఎక్కువ డివైస్‌లకు చేరుకోవడమే తమ లక్ష్యమని నెట్‌ఫ్లిక్స్ పార్ట్‌నర్ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్ చెప్పారు. దాదాపు పదమూడు కొత్త చిత్రాలు, తొమ్మిది కొత్త ఒరిజినల్ సిరీస్‌లు ఇప్పటికే అందుబాటులో ఉంచినట్టు సంస్థ తెలిపింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here