మెగాస్టార్ అంటే పిచ్చి.. అందుకే లేడీ ‘గ్యాంగ్ లీడర్’ అయ్యింది!

0
0


చిరంజీవి సూపర్ హిట్ సినిమా ‘అభిలాష’ ఆ అమ్మాయి పేరు. మరో సూపర్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’ ఆమె క్యారక్టర్. ఇక మెగాస్టార్ చిరంజీవి అంటే అభిలాషకు ఎంత పిచ్చి అంటే.. ‘జై చిరంజీవా’ అంటూ చేతికి పచ్చ బొట్టు పొడిపించుకునేంత. ఇంతకీ ఈ అభిలాష కథేంటి? చిరంజీవి కోసం చచ్చిపోయేంతగా పెంచుకున్న మెగాభిమానం ఆమెకు చేసిన మేలేంటి? ‘గ్యాంగ్ లీడర్’గా ఆమె ఎందుకు మారాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ‘సురభి 70ఎం.ఎం’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాత వై.గంగాధర్.

మెగా ఫ్యాన్‌గా అందాల భామ అక్షత శ్రీనివాస్ నటిస్తున్న ‘సురభి 70ఎం.ఎం’ చిత్రాన్ని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి పిక్చర్స్, అద్వైత పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వై.గంగాధర్ సొంత నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్నారు. ‘సురభి 70ఎం.ఎం’ అనే ధియేటర్‌ను కబ్జా చేసేందుకు ప్రయత్నించే ఓ రౌడీని మెగా ఫ్యాన్ అయిన అక్షత శ్రీనివాస్ తన గ్యాంగ్‌తో ఎలా ప్రతిఘటించింది? ఆ క్రమంలో ఆమె ‘గ్యాంగ్ లీడర్’ ఎలా అయ్యింది? వంటి ఆసక్తికర విషయాలు వెండి తెరపై చూడాల్సిందే అంటున్నారు దర్సక నిర్మాత వై.గంగాధర్.

Also Read: నేను, నా తమ్ముడు అందుకే ఓడాం.. రాజకీయాల్లోకి వద్దు: రజినీ, కమల్‌కు చిరు సూచన

మెగా ఫ్యాన్ అభిలాషగా నటిస్తున్న యువ కథానాయకి అక్షత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘స్వతహాగా మెగా స్టార్‌కు పెద్ద ఫ్యాన్ అయిన నాకు ‘సురభి 70ఎం.ఎం’లో మెగాభిమానిగా గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న ‘అభిలాష’ అనే పాత్రలో లేడి గ్యాంగ్ లీడర్‌గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందుకుగాను మా దర్శకనిర్మాత గంగాధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రం నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందని నమ్మకంగా చెప్పగలను. మా బాస్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన ‘సైరా’ సంచలన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here