మెరిసిన విరాట్ కోహ్లీ: రెండో టీ20లో టీమిండియా ఘన విజయం

0
2


హైదరాబాద్: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 150 పరగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పపరుగులు చేసి విజయం సాధించింది.

కెప్టెన్ కోహ్లీ 52 బంతుల్లో 72 నాటౌట్‌(4ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణంచగా… ఓపెనర్ ధావన్‌(40; 31 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్‌) ఫరవాలేదనిపించాడు. లక్ష్య చేధనలో టీమిండియాకు మంచి శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించిన అనంతరం రోహిత్‌(12)ను ఫెలుక్‌వాయో బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించారు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 61 పరుగులు జోడించారు. షంసీ బౌలింగ్‌లో ధావన్ బౌండరీ వద్ద డేవిడ్ మిల్లర్‌‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ధావన్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్‌ మరోసారి నిరాశపరిచాడు. ఫార్చూన్ బౌలింగ్‌లో పంత్‌(4) పేలవమైన షాట్‌ ఆడి వెనదిరిగాడు. శ్రేయాస్‌ అయ్యర్‌(16 నాటౌట్‌)తో కలిసి కోహ్లీ టీమిండియాకు విజయాన్ని అందించాడు. సఫారీ బౌలర్లలో ఫెలుక్‌వాయో, ఫార్చూన్, షమ్సీలు తలో వికెట్‌ దక్కించుకున్నారు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

టీమిండియా విజయ లక్ష్యం 150

అంతకముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డీకాక్ 37 బంతుల్లో 52(8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా… బవుమా 43 బంతుల్లో 49(3 ఫోర్లు, ఒక సిక్స్)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.

1
46111

దీంతో ఆతిథ్య జట్టుకు 150 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మ్యాచ్ అరంభంలోనే దక్షిణాప్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ చాహర్‌ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో హెండ్రిక్స్‌ (6) సుందర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బవుమాతో కలిసి కెప్టెన్ డికాక్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించాడు. ఈ క్రమంలో కెప్టెన్ క్వింటన్ డీకాక్ 37 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం టీమిండియా యువ పేసర్ నవదీప్ సైనీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

డికాక్‌ ఔటైన తర్వాత దక్షిణాఫ్రికా స్కోరు బోర్డులో వేగం తగ్గింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన డస్సన్‌(1) విఫలమయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మిగితా బ్యాట్స్‌మెన్ కూడా తేలిపోయారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లు తీయగా, నవదీప్ సైనీ, జడేజా, హార్ధిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

అంతకముందు టాస్ గెలిచిన టీమిండియా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరిస్‌లో ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో రెండు జట్లు విజయం కోసం తహతహలాడుతున్నాయి.

మూడు టీ20ల సిరిస్‌లో తొలి టీ20 మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో భారత్, దక్షిణాఫ్రికా పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌కే పరిమితమైంది. ఆరు నెలల తర్వాత టీమిండియా సొంతం గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడుతోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here