మెరుగైన ఫలితాల సాధనకు కృషి

0
0


మెరుగైన ఫలితాల సాధనకు కృషి

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయిలో జిల్లా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందకు ప్రధానాచార్యులు కృషి చేయాలని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి దాసరి ఒడ్డెన్న అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం విద్యాసంవత్సరం 2019-20 కార్యకలాపాల సమీక్ష సమావేశాన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రధానాచార్యులతో నిర్వహించారు. కళాశాలల నిర్వహణపై ప్రతి ఒక్కరు దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నారు. ప్రతి విద్యార్థి వివరాలను అంతర్జాలంలో పొందుపరచాలని సూచించారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు.
* హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కళాశాలలో మొక్కలను నాటి సరిపెట్టుకోకుండా వాటిని పరిరక్షించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి ఇంటి వద్ద రెండు మొక్కలను నాటే విధంగా ప్రోత్సహించాలన్నారు.

నులి పురుగుల నివారణకు..
ఈనెల 8న 19 ఏళ్ల లోపు పిల్లలందరికి ఆరోగ్యశాఖ సరఫరా చేస్తున్న నులి పురుగుల నివారణ మందు బిళ్లలను పంపిణీ చేయాలన్నారు. వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్‌ సంఘం అధ్యక్షుడు చిరంజీవి, వైద్యఆరోగ్య ప్రతినిధి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here