మెరుగైన సేవలు అందించాలి

0
3


మెరుగైన సేవలు అందించాలి

హీరా ఆసుపత్రిని ప్రారంభిస్తున్న అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా

నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో డ్వాక్రాబజార్‌ ఎదురుగా ఉన్న హీరా ప్రైవేట్‌ ఆసుపత్రిని గురువారం అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చర్మవ్యాధులతో పాటు జిల్లాలో ఎక్కడా లేనివిధంగా బట్టతలపై వెంట్రుకలు వచ్చేలా అత్యాధునిక పరికరాలతో శస్త్రచికిత్సలు చేసే సౌకర్యం జిల్లా కేంద్రంలో లభించడం అభినందనీయమన్నారు. ఒకే దగ్గర చర్మ, వెంట్రుకలు, దంత సంబంధిత ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుడు రేవంత్‌ మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా 16, 17తేదీలలో ఉచితంగా వైద్యపరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కౌలయ్య, డాక్టర్‌ సింధు, సౌందర్య, ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్‌ కవితారెడి,్డ డాక్టర్‌ సవితారాణి, డాక్టర్‌ నందకుమార్‌, డాక్టర్‌ ప్రతాప్‌ కుమార్‌, డాక్టర్‌ రఘు తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here