మైండ్ బ్లోయింగ్: గంటకు రూ.28 కోట్లు, రోజుకు 700 కోట్ల సంపాదన!

0
0


మైండ్ బ్లోయింగ్: గంటకు రూ.28 కోట్లు, రోజుకు 700 కోట్ల సంపాదన!

న్యూయార్క్: కొందరి వేతనం లేదా వారి సంపాదన చూస్తే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. నిమిషానికి 70,000 డాలర్లు, గంటకు 4 మిలియన్ డాలర్లు, రోజుకు 100 మిలియన్ డాలర్లు. వాల్ మార్ట్ లోని ప్రధాన షేర్ హోల్డర్లు వాల్టన్ కుటుంబం డబ్బులు పైవిధంగా సంపాదిస్తోంది. అంటే నిమిషానికి దాదాపు రూ.50 లక్షలు, గంటకు దాదాపు 28 కోట్లు, రోజుకు 700 కోట్లకు పైగా సంపాదన. దీంతో వీరు ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుబంం జాబితాలో ఉన్నారు.

ఆ ఫ్యామిలీ ఆస్తులు భారీగా పెరిగాయి..

మీరు ఈ వార్తను చదువుతున్నంతలోనే వారి ఆస్తులు 23,000 డాలర్లు పెరుగుతాయి. వాల్ మార్ట్ లో కొత్త ఉద్యోగి 11 డాలర్లు సంపాదిస్తాడు. వాల్ మార్ట్‌ను శ్యామ్ వాల్టన్ స్థాపించారు. ప్రపంచ అత్యంత ధనిక ఫ్యామిలీగా 2018 జూన్‌లో అగ్రస్థానం పొందారు. అప్పటి నుంచి వీరి ఆస్తులు 39 బిలియన్ డాలర్లు పెరిగి 191 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

వారి వద్దే 1.4 ట్రిలియన్ డాలర్ల సంపద

వారి వద్దే 1.4 ట్రిలియన్ డాలర్ల సంపద

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25 మంది బిలియనీర్ల వద్ద 1.4 ట్రిలియన్ డాలర్ల సంపద ఉంది. గత ఏడాదితో పోలిస్తే 24 శాతం వృద్ధి చెందింది. అమెరికాలో 0.1 శాతం మంది 1929 నుంచి ఎక్కువ సంపదను తమ వద్దే కలిగి ఉన్నారు. ఆసియా, యూరోప్ సంపన్నులు వేగంగా వృద్ధి చెందుతున్నారు.

క్యాండీ ఫేమ్

క్యాండీ ఫేమ్

క్యాండీ ఫేమ్ (చాక్లెట్లు) మార్స్ ఫ్యామిలీ ఆస్తులు 37 బిలియన్ డాలర్లు పెరిగి 127 బిలియన్ డాలర్లకు చేరుకుంది. పారిశ్రామికవేత్త కమ్ పొలిటికల్ పవర్ ప్లేయర్స్ కోచ్ కుటుంబం ఆస్తులు 26 బిలియన్ డాలర్లు పెరిగి 125 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

సౌదీ రాజకుటుంబం రిచ్

సౌదీ రాజకుటుంబం రిచ్

సౌదీ రాజకుటుంబం కూడా రిచ్ ఫ్యామిలీయే. సౌదీ రాజకుటుంబానికి చెందిన సంపద ఈ ఏడాది 100 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ చెల్లింపుల ఆధారంగా దీనిని లెక్కించారు. సౌదీ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన, ప్రపంచంలో అత్యంత లాభదాయకమైన దిగ్గజ ఆయిల్ కంపెనీ ఆరామ్‌కో వీరిదే. దీని విలువ 2 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

అంబానీ ఫ్యామిలీ ఆస్తులు

అంబానీ ఫ్యామిలీ ఆస్తులు

వీరితో పాటు ఫ్యాషన్ హౌస్ ఛానల్ ఓనర్స్, ఇటలీ ఫెరారీ ఫ్యామిలీ, న్యూటెల్లా, టిక్ టాక్ మింట్స్ ఫ్యామిలీలు కూడా ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే అంబానీ కుటుంబం ఆస్తులు 7 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

25 కుటుంబాల ఆస్తులు 250 బిలియన్ డాలర్లకు పెరిగింది

25 కుటుంబాల ఆస్తులు 250 బిలియన్ డాలర్లకు పెరిగింది

ప్రపంచంలోని 25 కుటుంబాల ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే 250 బిలియన్ డాలర్లు పెరిగింది. Bayerische Motoren Werke AG పూర్ సేల్స్ కారణంగా కాండ్ట్ ఫ్యామిలీ ఎనిమిది స్థానాలు దిగజారారు. అలాగే డసాల్ట్, డంకన్, లీ, హర్ట్స్ ఫ్యామిలీలు ఈ జాబితాలో లేకుండా పోయాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here