మైక్రోసాఫ్ట్‌కు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. టాప్ లేపిన ఐటీ దిగ్గజం

0
2


మైక్రోసాఫ్ట్‌కు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. టాప్ లేపిన ఐటీ దిగ్గజం

ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఐటీ కంపెనీలకు సంబంధించిన పాపులర్ రేటింగ్ సంస్థ ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో భారతీయ ఐటీ సంస్థలకు ప్రముఖంగా చోటు దక్కింది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీలు టాప్‌లో కొనసాగాయి.

ఫోర్బ్ జాబితాలో బ్యాంకింగ్ దిగ్గజం వీసాకు మొదటి స్థానం, రెండోస్థానంలో ఇటాలియన్ కార్ల ఉత్పత్తి సంస్థ ఫెరారీ నిలిచింంది. ఇక ఇన్ఫోసిస్ మాత్రం ఏకంగా మూడో స్థానాన్ని దక్కించుకొన్నది. 2018లో 31 స్థానంలో నిలిచిన ఇన్ఫోసిస్ ప్రస్తుతం 3 స్థానానికి ఎగబాకడం గమనార్హం. ఈ జాబితాలో టాప్‌గా నిలువడంపై ఫోర్బ్స్ స్పందిస్తూ.. ర్యాంకులపై ఆసియా దాడి అని పేర్కొన్నది.

టాప్ టెన్‌ జాబితాలో నెట్‌ఫ్లిక్స్ నాలుగో స్థానంలో, పేపాల్ 5వ స్థానంలో, మైక్రోస్టాఫ్‌కు 6వ స్థానం, వాల్టీ డిస్నీకి ఏడు, టయోటా మోటార్స్‌కు 8వ స్థానం, మాస్టర్ కార్డుకు 9వ స్థానం, కాస్ట్‌కో హోల్‌సేల్ పదో స్థానం దక్కాయి.

50 కంపెనీల ఫోర్బ్స్ జాబితాలో టీసీఎస్‌కు 22వ స్థానం, టాటా మోటార్స్‌కు 31వ స్థానంలో నిలిచాయి. ఇక టాటా స్టీల్ (105), లార్సెన్ అండ్ టర్బో, మహీంద్ర అండ్ మహీంద్ర (117), హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సెర్వ్ (143), పిరమిల్ ఎంటర్‌‌ప్రైజెస్ (149), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (153), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (155), హిందాల్కో ఇండస్ట్రీస్ (157), విప్రో (168), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (204), సన్ ఫార్మా ఇండస్ట్రీస్ (217), జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (224), ఐటీసీ (231) ఏషియన్ పెయింట్స (248) స్థానాల్లో నిలిచాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here