మొబైల్‌లో పాటలు వింటూ బాలిక దుర్మరణం, ఆ తప్పే ప్రాణం తీసింది!

0
0


మొబైల్‌లో పాటలు వింటూ నిద్రపోవడం చాలామందికి అలవాటు. అలాగే, కొందరు అలారం పెట్టుకుని తల వద్దే ఫోన్ పెట్టుకుని నిద్రపోతారు. ఇంకొందరు ఛార్జింగ్ పెట్టుకుని మరీ నిద్రలోకి జారుకుంటారు. వీటిలో ఏ అలవాటు ఉన్నా ప్రమాదకరమే. ఇందుకు కజఖస్థాన్‌లోని బస్టబ్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనే నిదర్శనం.

Read also: పూల సంచిలో మహిళా నిర్మాత శవం.. మిస్టరీగా మారిన హత్య, చంపింది అతడేనా?!

అలువా అసెట్కిజీ అబ్జల్‌బెక్ అనే 14 ఏళ్ల బాలిక‌కు పాటలు వింటూ నిద్రపోవడం అలవాటు. ఇటీవల నిద్రపోతూ ఆమె ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి, పాటలు పెట్టుకుని నిద్రపోయింది. తర్వాతి రోజు ఉదయం కుటుంబికులు వచ్చి చూసేసరికి ఆమె తల చిధ్రమై కనిపించింది. ఈ సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలికి వచ్చి అలువా శవాన్ని పంచనామాకు తరలించారు.

Read also: తైవాన్‌లో కూలిన భారీ వంతెన.. నదిలో పడ్డ వాహనాలు, షాకింగ్ వీడియో వైరల్

అలువా తల వద్ద మొబైల్ ఫోన్ పెట్టుకుని నిద్రపోయిందని, ఛార్జింగ్ పెట్టి ఉండటంతో అది పేలిందన్నారు. మొబైల్ ఫోన్‌ను తలకు దగ్గరగా పెట్టుకుని నిద్రపోవడం వల్ల అది పేలగానే.. తలకు తీవ్ర గాయమైందని పోలీసులు తెలిపారు. ఆమె గాయాలను పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు.. తెల్లవారుజామున మొబైల్ ఫోన్ బ్యాటరీ అతిగా వేడెక్కి పేలిందన్నారు. ఆమె తల వద్ద ఫోన్ పెట్టుకోకుండా నిద్రపోయి ఉంటే ప్రమాదం తప్పేదని తెలిపారు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోవడమే ఆమె చేసిన పొరపాటని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here