మొబైల్ గేమ్‌ ఆడుతూ.. రైల్వే ట్రాక్‌పై పడిపోయిన బాలుడు

0
0


స్మార్‌ఫోన్‌లో గేమ్ ఆడుతూ ఓ బాలుడు రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. రష్యాలోని యెకాటెరిన్బర్గ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటలో లీనమైన తొమ్మిదేళ్ల బాలుడు.. ప్లాట్‌ఫాం మీద నడుస్తూ నేరు ట్రాక్ వైపు నడిచాడు. కింద చూసుకోకపోవడంతో ట్రాక్‌పై పడ్డాడు. ఇది గమనించిన సిబ్బంది అతడి చేయందుకుని ట్రాక్ మీద నుంచి పైకి లాగాడు.

ఆ సమయంలో అటుగా రైళ్లేవీ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికలోవ్సకయ మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here