మొబైల్ ని ఛార్జ్ చేసేటప్పడు మనం చేసే 5 తప్పులు

0
1


మొబైల్ ని ఛార్జ్ చేసేటప్పడు మనం చేసే 5 తప్పులు : 

జనరల్ గా మనం మన ఫోన్స్ ని రోజు కి ఒక సారి అయిన ఛార్జ్ చేస్తూ ఉంటాం. మనం ఫోన్ ని ఛార్జ్ చేసేటప్పుడు మనం చేస్తున్న 5 తప్పులు గురించి ఈ ఆర్టికల్ లో వివరించబోతున్నాను.

1. పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ ఉపయోగించడం :

ఛార్జింగ్ పాయింట్స్ బయట షాపింగ్ మాల్స్ లో, సినిమా హాల్స్ లో, రైల్వే స్టేషన్ లో, బస్ స్టేషన్స్ లో మొదలైన పబ్లిక్ ప్లేస్ లో చూస్తూ ఉంటాం. చాలా మంది బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోన్స్ ఛార్జింగ్ లేకపోతే పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్ లో మొబైల్ కి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయడం మీ మొబైల్ కి చాలా ప్రమాదకరం. 

జనరల్ గా మనం మొబైల్ ని  ఛార్జ్  చేసేటప్పడు మొబైల్ వెలుగుతుంది. దీని అర్థం ఏమిటంటే, మీ ఫోన్ ని debugging కి allow చేశారు అని అర్థం.  మన మొబైల్ లో Debugging కి allow చేసినప్పుడు మాత్రమే మన మొబైల్ ఛార్జ్ అవుతుంది.

Debugging అంటే ఆండ్రాయిడ్ యాప్ ని develop చేసే వాళ్లకి తెలుస్తుంది. మిగిలిన పబ్లిక్ కి దీని గురించి అంత తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా ఉపయోగపడదు. 

Debugging గురించి సింపుల్ గా ఒక ముక్క లో చెప్పాలంటే USB కనెక్షన్ ద్వారా మన కంప్యూటర్ తో ఆండ్రాయిడ్ ఫోన్ ని కంట్రోల్ చేయడం.

మనం బయట మన ఫోన్ ని ఛార్జ్ చేసేటప్పుడు debugging allow లో ఉంటుంది కాబట్టి, మన ఫోన్ లోని personal డేటా అంటే మన ఫొటోస్, వీడియోస్, contacts, బ్యాంక్ వివరాలు, SMS లు మీ చుట్టూ పక్కల ఎవరైనా సైబర్ క్రిమినల్స్ ఉంటే, వాళ్లకి తెలిసే అవకాశం ఉంటుంది. 

2. Low battery వచ్చే వరకు మొబైల్ ని ఛార్జింగ్ పెట్టకపోవడం :

చాలా మంది మొబైల్ low బ్యాటరీ అయ్యే వరకు కానీ, అసలు పూర్తి గా ఛార్జింగ్ అయిపోయే వరకు కానీ వాళ్ళ మొబైల్ కి ఛార్జింగ్ పెట్టరు. ప్రతి సారి low బ్యాటరీ వచ్చిన తరువాత కానీ, మీ ఛార్జింగ్ పూర్తి గా అయిపోయిన తరువాత గాని మీరు ఛార్జింగ్ పెడితే మీ మొబైల్ బ్యాటరీ degrade అయ్యే ప్రమాదం ఉంది, దీని కారణం చేత భవిష్యత్ లో మీ బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది.

3. కొత్త మొబైల్ ని 12 గంటల వరకు ఛార్జ్ చేయడం : 

కొన్ని సంవత్సరాల క్రితం మనం కొత్త మొబైల్ కొంటె బాక్స్ లో నుంచి మొబైల్ బయటికి తీసిన వెంటనే ఆ మొబైల్ కి 12 గంటల వరుకు ఛార్జింగ్ పెట్టె వాళ్ళము. ఈ ప్రోసెస్ ని ” activation ” అని అంటాము. ఖచ్చితంగా అప్పుడు కొన్న కొత్త మొబైల్స్ 12 గంటల వరకు ఛార్జింగ్ పెట్టాలి. కానీ ఇప్పడు అన్ని మొబైల్స్ లితియం అయాన్ ( Lithium ) బ్యాటరీ తో వస్తున్నాయి.ఇప్పుడు కొన్న కొత్త మొబైల్స్ కి 12 గంటల వరకు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. 

ఇప్పుడు మీరు కొత్త మొబైల్ కొంటె ,మొబైల్ కంపెనీ వాళ్లే మీకు 50%  బ్యాటరీ ని కొత్త మొబైల్ ఫోన్స్ లో ఇస్తున్నారు. ఇంకొక ముఖ్య మైన విషయం ఏమిటంటే మొబైల్ యొక్క బ్యాటరీ 40 (%)శాతం నుంచి 80 శాతం మధ్యలో ఉంటే బ్యాటరీ performance  చాలా బాగుంటుంది. ఇంకా మీరూ కొత్త మొబైల్ కొన్నపుడు నార్మల్ గా మొబైల్ ని ఛార్జ్ చేస్తే చాలు, 12 గంటలు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు.

4. ఛార్జింగ్ పోర్ట్ ని క్లీన్ చేయకపోవడం : 

చాలా మంది చేసే తప్పు ఏమిటంటే, వాళ్ళ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ని క్లీన్ చేసుకోక పోవడం. మనం మొబైల్ కొన్ని నెలలు వాడిన తరువాత ఖచ్చితంగా మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ లో డస్ట్ ఏర్పడుతుంది. డస్ట్ ఛార్జింగ్ పోర్ట్ లో ఎక్కువ అయిపోతే, మొబైల్ మీకు స్లో గా ఛార్జ్ అవుతుంది. కొన్ని సార్లు మొబైల్ ఛార్జింగ్ కూడా ఎక్కడు. మొబైల్ ఛార్జింగ్ ఎక్కక పోతే, మనం బయట సర్వీస్ సెంటర్స్ కి తీసుకు వెళతాం. అక్కడ షాప్ వాళ్ళు ఛార్జింగ్ పోర్ట్ పోయింది కొత్తది వేయాలి అది ఇది అని కహానిలు చెప్పి మీ దగ్గర డబ్బులు దొబ్బుతారు. బెటర్ మీరు నెలకి ఒక సారి మీ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ ని క్లీన్ చేసుకోండి. మార్కెట్ లో కొన్ని ఛార్జింగ్ పోర్ట్ క్లీనింగ్ వస్తులు కూడా online లో లభిస్తున్నాయి. 

5. డూప్లికేట్ / నాసిరకం ఛార్జర్స్ ఉపయోగించడం :

కొంత మంది మొబైల్ ఫోన్స్ కి కంపెనీ అందిస్తున్న ఒరిజినల్ ఛార్జర్స్ వాడారు. తక్కువ ధరలో వస్తున్నాయి అని చెప్పి నాసిరకం ఛార్జర్స్ ని కొని, వాటితో వాళ్ళ మొబైల్ ఫోన్స్ కి ఛార్జింగ్ పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల మీ మొబైల్ యొక్క బ్యాటరీ చెడిపోయే ప్రమాదం ఉంది. కొన్ని మొబైల్స్ పేలి పోయే ప్రమాదం కూడా ఉంది. కంపెనీ వాళ్ళు ఒరిజినల్ ఛార్జర్స్ ఆ మొబైల్ మీద బాగా టెస్ట్ చేసి మార్కెట్ లోకి వదులుతారు. అన్ని టెస్ట్ లు పాస్ అయ్యాకే ఆ చార్జర్ ని మన మొబైల్ బాక్స్ లో మనకి provide ( అందిస్తారు ) చేస్తారు. కొంచెం ధర ఎక్కువైన ఒరిజినల్ ఛార్జర్స్ కొనండి. 

ఇది ఫ్రెండ్స్ మొబైల్  ఛార్జింగ్ విషయం లో మనం చేసే 5 తప్పులు. ఈ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వీటి గురించి తెలుసుకుంటారు. ఇలాంటి మరింత సమాచారం కోసం ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ని ఫాలో అవ్వండి. ఈ ఆర్టికల్ చదివి నందుకు ధన్యవాదాలు.

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here