మొహాలీలో రెండో T20I: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

0
1


హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో రెండో టీ20కి సర్వం సిద్ధమైంది. మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరిస్‌లో ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

దీంతో ఈ మ్యాచ్‌లో రెండు జట్లు విజయం కోసం తహతహలాడుతున్నాయి. మూడు టీ20ల సిరిస్‌లో తొలి టీ20 మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో భారత్, దక్షిణాఫ్రికా పోరు రెండు మ్యాచ్‌ల సిరీస్‌కే పరిమితమైంది. ఆరు నెలల తర్వాత టీమిండియా సొంతం గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడుతోంది.

ఈ మ్యాచ్‌ని గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసి వన్డే వరల్డ్‌కప్‌లో పేలవ ప్రదర్శన చేసిన సఫారీలు ఆ తర్వాత ఆడుతోన్న తొలి టీ20 సిరిస్ కావడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి బోణీ కొట్టాలని సఫారీలు భావిస్తున్నారు.

1
46111

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో ఇరు జట్లు యువ ఆటగాళ్లతో బరిలోకి దిగాయి. భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటివరకు 13 టీ20లు ఆడాయి. ఇందులో టీమిండియా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా… 5 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. టీమిండియా చేతిలో అత్యధిక టీ20 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన జట్టుగా ఆస్ట్రేలియా(11) అగ్రస్థానంలో ఉంది.

జట్ల వివరాలు

టీమిండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ

దక్షిణాఫ్రికా: క్వింటన్ డీకాక్ , ఆర్ హెండ్రిక్స్, టి బావుమా, డుసెన్, డేవిడ్ మిల్లెర్, ప్రిటోరియస్, ఎ ఫెహ్లుక్వాయో, బి ఫోర్టుయిన్, కగిసో రబడ, ఎ నార్ట్జే, షంసిSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here