మోడి 2.075 … ఎంపీల బలం,స్పష్టమైన లక్ష్యాలతో అనూహ్య విజయాలు సాధించాం.. ప్రధాని మోడి

0
3


మోడి 2.075 … ఎంపీల బలం,స్పష్టమైన లక్ష్యాలతో అనూహ్య విజయాలు సాధించాం.. ప్రధాని మోడి

ఇదిగో ఇది మా 75 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీడీయాతో మాట్లాడారు. రెండవ సారి తిరుగు లేని మెజారీటిని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సాధించిన ఫలితాలను ఆయన వివరించారు. ఈనేపథ్యంలనే స్పష్టమైన విధానాలు, సరైన ఉద్దేశ్యాలతో ముందుకు సాగుతున్నట్టు ప్రధాని మంత్రి తెలిపారు.దీని వల్లే అనూహ్య విజయాలు సాధించామని స్పష్టం చేశారు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చి 75 రోజులు గడుస్తుండడంతో ప్రధాని మోడీ ప్రభుత్వ పనివిధానాన్ని వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వం స్పష్టమైన విధానాలతోపాటు, సరైన లక్ష్యాలతో ముందుకు సాగుతోందని అందుకే పలు విజయాలు సాధించిందని పేర్కోన్నారు. ముఖ్యంగా గత డెబ్బై అయిదు రోజుల్లో దేశంలో ముస్లిం మహిళలు ఎదుర్కోంటున్న ట్రిపుల్ తలాక్ తోపాటు,పిల్లల హక్కుల సంబంధించి బిల్లులు పాస్ చేశామని చెప్పారు. దీంతోపాటు చంద్రయాన్ 2 కూడ విజయవంతంగా ప్రయోగించామని తెలిపారు. ఇక కశ్మీర్ విషయంలో ప్రజా అభిప్రాయాన్ని అమలు పరిచామని చెప్పారు.

ఈ నేపథ్యలోంలో ప్రభుత్వానికి సహకిరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యంగా గత ప్రభుత్వ కాలంలో తీసుకువచ్చిన పలు నిర్ణయాల వల్లే 75 రోజుల్లో అనేక విజయాలు సాధించగల్గిగామని చెప్పారు.కాగా గత అయిదు సంవత్సరాల్లో వందాలాది సంస్కరణలు చేపట్టామని వివరించారు.దీంతో ప్రజలు ఎంతో శక్తివంతంగా అభివ‌ృద్ది బాట పట్టారని అన్నారు.ఇదంతా కేవలం అధికారిక నిర్ణయాలతో కాకుండా పార్లమెంట్‌లో చేసిన పలు నిర్ణయాల వల్ల సాధించామని అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here