మోడీ టార్గెట్ చేరుకోవాలంటే ఇలా అసాధ్యం.. 5 ఏళ్లు 9% ఉంటేనే

0
4


మోడీ టార్గెట్ చేరుకోవాలంటే ఇలా అసాధ్యం.. 5 ఏళ్లు 9% ఉంటేనే

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల టార్గెట్ పెట్టుకుంది. దీనిని చేరుకోవాలంటే ప్రతి సంవత్సరం వృద్ధి రేటు 9 శాతంగా ఉండాలని అంచనా. అలాగే, స్థూల జాతీయోత్పత్తిలో పెట్టుబడి రేటును 38 శాతానికి పెంచవలసి ఉంటుంది. వచ్చే అయిదేళ్లలో తొమ్మిది శాతం వృద్ధిరేటు సాధిస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని యర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై) వెల్లడించింది.

ఈ వృద్ధితో మోడీ టార్గెట్ చేరుకోవడం కష్టమే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించుకున్న ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవడం ప్రస్తుత వృద్ధితో అసాధ్యమని అభిప్రాయపడింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో వచ్చే మార్చి నాటికి 7 శాతం వృద్ధితో భారత ఆర్థిక వ్యవస్థ మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకునే అవకాశముందని పేర్కొంది.

9 శాతం వృద్ధి సాధిస్తే ఇలా పెరుగుదల..

9 శాతం వృద్ధి సాధిస్తే ఇలా పెరుగుదల..

గత ఏడాది ఇది 2.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. వరుసగా వచ్చే అయిదేళ్ల పాటు తొమ్మిది శాతం వృద్ధిరేటును సాధిస్తే భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 3.3 ట్రిలియన్ డాలర్లకు, ఆ తర్వాత సంవత్సరం 3.6 ట్రిలియన్ డాలర్లకు, 2022-23 నాటికి 4.1 ట్రిలియన్ డాలర్లకు, 2023-24లో 4.5 ట్రిలియన్ డాలర్లకు, 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశముందని పేర్కొంది.

వృద్ధి శాతంతో పాటు ఇవి కూడా..

వృద్ధి శాతంతో పాటు ఇవి కూడా..

ద్రవ్యోల్బణం 4% కంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరో రెండు శాతం బలపడినప్పుడే ఈ లక్ష్యానికి చేరుకుంటామని తెలిపింది. వృద్ధికి ఊతమిచ్చే చర్యలను కేంద్ర ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలని తెలిపింది. ముఖ్యంగా ప్రయివేటు పెట్టుబడులను మరింత ప్రోత్సహిస్తేనే ఇది సాధ్యమవుతుందని తెలిపింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here